వాయు కాలుష్యంతో పది నగరాలలో 7.2 శాతం మంది మృతి

భారతదేశంలో ప్రధాన పది నగరాలు వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిల్లో దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పూనె, సిమ్లా, వారణాసి, అహ్మదాబాద్‌లు ఉన్నాయి. ఈ నగరవాసులకు కచ్చితంగా అనారోగ్యాలు తలెత్తడం సహజం. 

కానీ వాయుకాలుష్యం వల్లే ఈ పది నగరాల్లోని ప్రజలు ప్రతి రోజూ సగటున 7. 2 శాతం మంది చనిపోతున్నారని తాజాగా ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది.  ఈ నగరాల్లో కాలుష్య స్థాయిలు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన రేణువుల వల్ల సంభవించే వాయు కాలుష్యం (పిఎం2.5) కారణంగా ఎంతోమంది చనిపోతుంటారు. ప్రజలు వాయుకాలుష్యం వల్ల చనిపోతున్న రాష్ట్రాల్లో దేశరాజధాని ఢిల్లీనే ముందువరుసలో ఉంది.  ప్రధానంగా ఈ రాష్ట్రంలో వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన పదార్థాల వల్ల వెలువడే కాలుష్యంతో అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ఈ లాన్సెట్‌ అధ్యయనం కనుగొంది. భారతీయ నగరాలలో ముఖ్యంగా స్థానిక వాయు కాలుష్యమే మరణాలకు కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు. 

ఈ అంతీర్జాతీయ  పరిశోధక బృందంలో వారణాసిలోని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని దీర్ఘకాలిక వ్యాధి నియంత్రణ కేంద్రం పరిశోధకులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం గాలిలో సూక్ష్మరేణువులతో కూడిన (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పిఎం2.5)) కాలుష్యం సగటున క్యూబిక్‌ మీటర్‌కు 15 మైక్రోగ్రాములు నిర్దేశిస్తుంది.

కానీ గడచిన రెండు రోజుల్లో పిఎం2.5 కాలుష్యం అత్యధిక స్థాయిలో పెరిగింది. గడచిన 24 గంటల్లో భారత్‌లోని వాయు నాణ్యతా ప్రమాణాలు క్యూబిక్‌ మీటర్‌కు 60 మైక్రోగ్రాములు నిర్దేశించాయి. దీనివల్ల వాయుకాలుష్యం వల్ల మరణించే వారి శాతం 2.7 శాతం మేర పెరిగిందని పరిశోధకులు తెలిపారు.

దేశంలో డబ్ల్యుహెచ్‌ఓ నిర్దేశాల ప్రకారం వాయుకాలుష్యం క్యూబిక్‌ మీటర్‌కు 15 మైక్రోగ్రాములు కాస్తా భారత్‌లో 10 మైక్రోగ్రాములు నిర్దేశిస్తోంది. ఇక నగరాల వారీగా వాయుకాలుష్యం వల్ల రోజువారీ మరణాల్లో 0.31 శాతం పెరగుదల ఉందని పరిశోధకులు కనుగొన్నారు. 

అత్యధికంగా వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ, బెంగళూరులో రోజువారీ మరణాల పెరుగుదల 3.06 శాతంగా ఉంది. ఇక పరిశోధకులు అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, పూనె, సిమ్లా, వారణాసి వంటి నగరాల్లో దీనికోసం 2008 నుంచి 2019 మధ్యకాలంలో రోజువారీగా మృతిచెందిన 36 లక్షల మరణాలను పరిశీలించారు.