ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంకు చెందిన వనిందు హసరంగను అధిగమించి నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచిన పాండ్యా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 222 పాయింట్లతో హసరంగతో సమానంగా నిలిచాడు. 
 
వరల్డ్‌ కప్‌లో ఆటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్‌తో ఆకట్టుకోగా అదే సమయంలో జట్టుకు అవసరమైన సమయంలో బంతితోనూ మ్యాజిక్‌ చేశాడు. 150 కంటే ఎక్కువ స్ట్రయిక్‌ రేట్‌తో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్ల తీశాడు. కీలమైన ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌తో పాటు రబాడా వికెట్లు తీసి మ్యాచ్‌ ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ టైటిల్‌ను నెగ్గేందుకు సహకారం అందించాడు.
 
ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ టెన్‌లో హసరంగ, మార్కస్ స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, దీపేంద్ర సింగ్‌, లియామ్ లివింగ్‌స్టోన్, ఐడెన్ మార్క్‌రమ్, మోయిన్‌ అలీ ఉన్నారు. ఇక టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అన్రిచ్‌ నొర్ట్‌జే రెండో స్థానానికి చేరుకున్నాడు. ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని రెండో స్థానానికి ఎగబాగాడు. 
 
ఇక ప్రపంచకప్‌లో 15 వికెట్లతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 12 స్థానాలు మెరుగుపరుచుకొని 12వ స్థానానికి చేరుకున్నాడు. టాప్‌-10 బౌలర్లలో అక్షర్‌పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ చోటు సంపాదించారు. టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అర్షదీప్‌ సింగ్‌ 13వ స్థానానికి చేరాడు. ఇక శ్రీలంక బౌలర్‌ హసరంగ రెండో స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్‌ ఆల్‌ రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ మూడోస్థానంలో ఉన్నాడు.