
కోకాకోలా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ హెన్రిక్యూ బ్రౌన్ ఈ మేరకు సంస్థ ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ లకు ఇంటర్నల్ నోట్ పంపిణీ చేశారు. ‘జూన్ 30 నుంచి బిగ్ కార్పొరేట్ ఆఫీసు మూసేస్తున్నాం. బిగ్ హెడ్ క్వార్టర్స్‌ను మూసేస్తాం. మిగతా బాట్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమబద్ధీకరిస్తాం’ అని హెన్రిక్యూ బ్రౌన్ పేర్కొన్నారు.
భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలను కోకాకోలా ఇంటర్నల్ బోర్డు పర్యవేక్షిస్తుందని ఆ నోట్ పేర్కొంది. భారత్‌లో బిగ్ పర్యవేక్షణలో నడుస్తున్న హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ పై నేరుగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గత జనవరిలో హెచ్‌సీసీబీ దేశంలోని తమ కంపెనీ ఆధీనంలోని బాట్లింగ్ కార్యకలాపాలను మూడు సంస్థలకు విక్రయించింది. ఉత్తర భారత్ లో మూన్ బేవరేజెస్, ఈస్ట్రన్ ఇండియాలో ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్, ఈశాన్య భారత్ లో కంధారి గ్లోబల్ బేవరేజెస్ సంస్థలకు విక్రయించింది.
తద్వారా కోకాకోలా 293 మిలియన్ డాలర్లు లాభ పడింది. దీని తర్వాత పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 16 ఫ్యాక్టరీలను మాత్రమే హెచ్‌సీసీబీ నిర్వహిస్తోంది. 2006లో కోకాకోలా తన బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దేశంలో బాట్లింగ్ ఆపరేషన్స్ ప్రారంభించింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు