పోక్సో కేసును కొట్టివేయని హైకోర్టుకు యడ్యూరప్ప

మైనర్‌ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఆ కేసును కొట్టి వేయాలని కోరుతూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యడ్యూరప్ప పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ డాలర్స్‌ కాలనీలోని యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. అక్కడ తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేస్తూ.. ఆ మహిళ మార్చి నెలలో సదాశివ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గంటల వ్యవధిలో కర్ణాటక డీజీపీ అలోక్‌ మోహన్‌ ఆ కేసును విచారణ నిమిత్తం సీఐడికి బదిలీ చేశారు. జూన్‌ 17న సీఐడీ అధికారులు యడ్యూరప్పను మూడు గంటలపాటు విచారించారు. ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ కేసుపై మాజీ సీఎం యడ్యూరప్ప స్పందిస్తూ.. ‘నాపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని’ పేర్కొన్నారు.

కాగా, పోక్సో కేసులో యడియూరప్పకు మరో రెండు వారాలు ఊరట లభించింది. పోక్సో కేసు రద్దు చేయాలని యడియూరప్ప దాఖలు చేసుకున్న పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం.. రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయనపై రెండువారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సీఐడీకి వీలు లేకుండా పోయింది.

తాజాగా ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో యడ్యూరప్ప కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అనూహ్యంగా గురువారం  సాయంత్రం సీఐడీ అధికారులు యడ్యూరప్పపై 750 పేజీల ఛార్జ్‌షీట్‌ వేశారు.

ఈ ఏడాది మార్చి 14న నమోదైన కేసులో బెంగళూరు కోర్టు ఎడియూరప్పపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జూన్ 13న జారీచేసింది. కాగా..ఎడియూరప్ప అరెస్టును నిలుపుదల చేస్తూ జూన్ 14న కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి ఎదుట హాజరు కావాలని కూడా ఆయనను కోర్టు ఆదేశించింది. జూన్ 17న ఎడిచూరప్పను సిఐడి 3 గంటలకు పైగా ప్రశ్నించింది.