ఒవైసీ ఎంపీగా అనర్హుడిగా చేయాలనీ రాష్ట్రపతి ముర్ముకి లేఖ

ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు. 

ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. తన డిమాండ్‌కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఈ సందర్భంగా ఆమె ఉదాహరించారు. ఈ ప్రకరణలు ఒవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఉపకరిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు ఎంపీ ఒవైసీ వ్యాఖ్యలపై గోవాలోని హిందు నాయకులు నుంచి నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో ఒవైసీపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా దక్షిణ గోవాలోని పొండా తాలుకలో జరిగిన 12వ విష్వక్ హిందూ రాష్ట్ర మహోత్సవంలో.. ఒవైసీనపై అనర్హత వేటు వేయాలని తీర్మానం కూడా చేశారు. 102 డి ప్రకరణ ప్రకారం అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయవచ్చని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.