
ఢిల్లీలో నీటి సంక్షోన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు చేస్తున్న ఆప్ మంత్రి ఆతిషి ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడంతో ఆమెను లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌కు మంగళవారం ఉదయం తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు.
నాలుగు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని పేర్కొంటూ వైద్యుల సూచనలమేరకు ఆమె తన దీక్షను ఆసుపత్రిలో విరమించినట్లు ఆయన ప్రకటించారు. కాగా, ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె కీలక అవయవాలు స్థిరంగా ఉన్నాయని చెప్పారు.
ఆతిషి రక్తనమూనాలకు ఆస్పత్రికి పంపింమని, రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారని చెప్పారు. శరీరంలో కీటోన్ స్థాయి పెరిగిందనీ, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు.
వెంటనే దవాఖానలో చేర్చించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అందుకే దవాఖానకు తరలించామని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం ఆతిషి పోరాడుతున్నారని చెప్పారు. ఢిల్లీకి చెందిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. హర్యానా నీటిని విడుదల చేసే వరకు ఆమరణ నిరవధిక దీక్షను విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ 36కు పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. కాగా, దిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 ఎమ్‌జీడీ (రోజుకు మిలియన్ గ్యాలన్లు) తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోందని ఆతిశీ తెలిపారు. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆతిశీ పేర్కొన్నారు. మరోవైపు హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు