రాక్షసంగా అత్యాచారానికి గురైన చెంచు మహిళను ఆదుకోవాలి 

చింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళా ఈశ్వరమ్మ అనే చెంచు మహిళను పది రోజులుగా నిర్బంధించి రాక్షసంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత ఘోరం జరుగుతున్న పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు పసిగట్ట లేకపోయిందని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రశ్నించారు. 

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని పరామర్శించి స్వయంగా వైద్యురాలు కావడంతో ఆమెను పరీక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి రాక్షసులుగా ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఆమె మండిపడ్డారు.  విపరీతమైన బాధలో ఆమె మాట్లాడే పరిస్థితిలో కూడా లేదని ఆమె చెప్పారు. 

బండి వెంకటేష్, ఆయన భార్య, బండి శివయ్య లతోపాటు పలువురు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వివరించారని తెలుపుతూ ఇలాంటి మహిళకు రక్షణ కల్పించి పనిచేసుకునే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల పరిహారం చెల్లించి బాధితురాలు ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరుగుతున్న మహిళలపై దాడులు అత్యాచారాలు రాక్షస క్రీడల పై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని లేకపోతే మహిళల పక్షాన మహిళా మోర్చా ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించి తమ సత్తా చాటుతామని ఆమె హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బలమూర్ జానకి రాష్ట్ర కార్యదర్శి దశరథ లక్ష్మి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దొడ్ల రాఘవరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తేజస్విని ఉపాధ్యక్షురాలు ఇంద్రారెడ్డి పట్టణ అధ్యక్షురాలు మహేశ్వరి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షులు పోలు దాసు రాము కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి నాయకులు రాజేష్ రెడ్డి చందు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు