లోటస్ పాండ్ వద్ద రోడ్డుకు అడ్డుగా నిర్మాణాలు వెలివాయి. ఇవి రోడ్డుపైనే ఉన్నాయన్న ఫిర్యాదు స్థానికుల నుంచి గ్రేటర్ అధికారులకు అందింది. గత శుక్రవారం ఆ నిర్మాణాదారులకు గ్రేటర్ అధికారులు నోటీసులు జారీ చేశారు.అనంతరం శనివారం రోజున హైదరాబాద్‌లోని జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద అనుమతి లేకుండా రోడ్డుపైనే వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు.
లోటస్ పాండ్ వద్ద సెక్యూరిటీ వారి కోసం వేసిన షెడ్లను అధికారులు తొలగించారు. రోడ్డును ఆక్రమించుకొని వాహనాల రాకపోకలకు అడ్డుగా ఈ షెడ్లు ఉన్నాయనేది ప్రధాన కారణం. ఆ రోడ్డు మార్గంలో వాటి వల్ల రాకపోకలు సాగించడం అసౌకర్యంగా ఉందనీ స్ణానికుల నుంచి ఫిర్యాదు జీహెచ్‌ఎంసీ అధికారులకు అందింది.
ఆ మూడు షెడ్లు ఏపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి భద్రతకు, పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐపాక్(ఐపిఏసి)కి చెందిన వారు ఉపయోగించుకుంటున్నారు. వీటికి అనుమతి లేదనీ, వాటిని కూల్చేసి రోడ్డలో వాహనా రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!