మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరో భూకబ్జా కేసు

మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్‌ఎ మల్లారెడ్డిపై పేట్‌బషీర్‌బాద్ పోలీసులు మరో భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై మొత్తం ఏడు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు సమాచారం.  పేట్ బషీర్ బాద్ లో 32 గుంటల భూమి ఆక్రమణకు గురై నిర్మాణాలు కూల్చివేసినట్లు శేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు.  శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.

 తాజాగా మల్లార్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సుచిత్రలో పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ కేసులో పేట్ బషీర్ బాద్ మల్లారెడ్డిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించిన విషయం విదితమే. నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వేనెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది.  ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది పేర్కొనగా, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు నిచ్చింది.

అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు జరగవద్దని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు.  అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం ఇంకా కొనసాగు తూనే ఉండగా ఇప్పడు మరో భూవివాదంలో మల్లారెడ్డిపై కేసు నమోదు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.