ఏపీ నుండి బిజెపి ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి

నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మొదటిసారిగా ఏపీ నుండి ఎన్నికైన బీజేపీ ఎంపీకి అవకాశం కలుగుతుంది. గతంలో రాష్ట్రం నుండి ఎం వెంకయ్యనాయుడు, నిర్మల సీతారామన్ కేంద్ర మంత్రివర్గంలో చేరినా వారి ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మ (57)కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. 

శ్రీనివాస వర్మ నర్సాపురం నుంచి మొదటి సారి ఎంపీగా గెలుపొందారు.  భీమవరంలో జన్మించిన ఆయన గతంలో రెండు సార్లు బిజెపి అభ్యర్థిగా లోక్ సభకు పోటీచేశారు. ఇప్పటివరకు నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటి చేసిన వారిలో ఎవరికి రాని రికార్డ్ స్థాయిలో. 2.76 లక్షల ఓట్ల మెజారీటితో శ్రీనివాస్ వర్మ గెలుపొందారు. ఆయన  ప్రస్తుతం బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహారిస్తున్నారు.

భీమవరంలోని డీఎన్​ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శిగా, కార్సపాండెంట్​గా పనిచేశారు. బీజేపీ యువమోర్చలో క్రీయ శిలక పాత్ర పొషించారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా రెండు సార్లు సేవలు అందించారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్​గా బీజేపీ తరపున ఎన్నికయ్యారు. మాస్టార్ లైబ్రెరియన్ కోర్స్ చదివిన శ్రీనివాస్ వర్మ లైబ్రెరియన్​గాను ఉద్యోగం చేశారు.

సంఘ్ పరివార్​తో సత్ససంబంధాలు కలిగిన శ్రీనివాస్ వర్మ, ఏబీవీపీలో చురుకుగా వ్యహరించి పార్టిలో గుర్తింపు పొందారు.  నర్సాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా సేవలందించిన ప్రముఖ నటుడు కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితుడుగా, ఆత్మీయుడిగా వ్యవహరించారు. అందుకనే ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ వర్మ తరపున కృష్ణంరాజు భార్య ప్రచారంలో పాల్గోన్నారు.   “నా తమ్ముడిని గెలిపిస్తే కృష్ణంరాజుని గెలిపించినట్లే” అంటూ ఆమె శ్రీనివాస్ వర్మ తరపున ప్రచారం చేశారు.

 
గత ఎన్నికలలో గెలుపొందిన వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు వంటి ఎందరో ప్రముఖులు ఈ సీటు కోసం పోటీపడిన ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసిన తనను అభ్యర్థిగా ఎంచుకోవడం ఓ సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా చెబుతుండేవారు.  వివాదరహితుడుగా పేరొందారు.