
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైఎస్ భారతి రెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగిందని మాజీ మంత్రి, జమ్మలమడుగు బిజెపి శాసనసభ్యుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారతి రెడ్డి ప్రమేయం కూడా త్వరలో బయటకొస్తుందని ఆయన వెల్లడించారు. జగన్ కేసులపై విచారణ వేగవంతం కానుందని స్పష్టం చేసారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలం పెరిగిందని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు గెలుపొందిందని పేర్కొన్నారు. ఆరు ఎంపీ స్థానాలకు మూడు చోట్ల విజయం సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారని, త్వరలో అతనిపైనా చర్యలు ఉంటాయని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీలో చేరేందుకు ఇప్పటికే చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. అయితే, రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించిన వారి విషయంలో బీజేపీ అధిష్ఠానం సైతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు రాష్టానికి మంచి జరగాలని కూటమికి మద్దతు తెలియచేశారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచక పాలనకి ప్రజలు తమ ఓటుతో స్వస్తి పలికారని వెల్లడించారు. పుష్ప సినిమా మాదిరిగా జగన్ నేతృత్వంలోనే ఎర్రచందనం స్మగలింగ్ చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది మెుదలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గ్రామీణ ఉపాధిని తుంగలో తొక్కారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు.
ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్కు కాలాలనే స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు అభివృద్ధికి అనేక విధాలుగా అవరోధాలు సృష్టంచారన్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. వారం రోజుల్లోపే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు జంపింగ్ కి సిద్ధం అవుతున్నారని ఆయన వెల్లడించారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం