
’’బండి సంజయ్ గలీజోడు… ముస్లింలంతా ఏకమై ఆయనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చిండు… ఏమైంది.. అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అడ్రస్సే గల్లంతు చేశారు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. తనను ఓడించేందుకు ఒక వర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి కరీంనగర్ ప్రజల దమ్ము చూపారని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని సంజయ్ హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం బండి సంజయ్ ఎస్సారార్ కళాశాల వద్దకు వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
ఇది ప్రజా విజయం… ఈ విజయం బీజేపీ కార్యకర్తలకే అంకితం. మోదీగారి అద్బుతమైన పాలనను గుర్తించి ప్రజలు కట్టబెట్టిన విజయమిది. కరీంనగర్ సహా తెలంగాణ అభివ్రుద్ది చెందాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలనే లక్ష్యంతో తనకు భారీ మెజారిటీ అందించారని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ అంతటా మోదీ హవా కొనసాగింది. లేకుంటే ఇంతటి విజయం సాధ్యమయ్యేది కాదని చెప్పారు.
“తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలుసహా హామీలన్నీ అమలు చేయించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల పక్షాన ముందుండి కొట్లాడతాం. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే హామీలను అమలు చేయిస్తాం.. అందుకోసం ప్రజల పక్షాన ఉధ్రుత ఉద్యమాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాం” అని ప్రకటించారు.
మీరు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారని, 6 నెలలు దాటిందని చెబుతూ మరో 3 నెలల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీలతోసహా హామీలన్నీ అమలు చేసి తీరాలని కాంగ్రెస్ ప్రభుత్వంకు ఆయన హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి తెగించి కొట్లాడతామని, కాంగ్రెస్ సంగతి చూస్తామని తెలిపారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది