గడచిన ఏడాది కంటే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్‌యు) రూ. 1.26 లక్షల కోట్ల డివిడెండ్‌తో రికార్డు సృష్టించాయి. గతేడాది కంటే ఈ ఏడాది సిపిఎస్‌యుల డివిడెండ్ 28.7 శాతం పెరిగింది. గతేడాది (2023) డివిడెండ్ రూ. 97,750 కోట్లు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని సమకూర్చడంలో ఈ సిపిఎస్‌యులకు 60 శాతం వాటా వుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల వల్ల రూ. 76,166 కోట్ల డివిడెండ్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. క్రితం ఏడాది రూ. రూ. 59,406 కోట్లు కంటే ఈ ఏడాది 28.2 శాతం పెరగొచ్చునని కేంద్ర ప్రభుత్వం అంచనా. గడచిన ఐదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే సిపిఎస్‌యుల వాటా పెరుగుతూనే ఉంది. వార్షిక వృద్ధిరేటు 19.2 శాతం.
ప్రత్యేకించి ఈ కాలంలో వృద్ధిరేటు 18.9 శాతంగా ఉంది. వివిధ ప్రభుత్వ రంగ వాటాలను పరిశీలిస్ ఎన్‌టిపిసి వాటా 51.1 శాతంతో చాలా తక్కువగా ఉంది. 98.25 శాతంతో పంజాబ్, సింధ్ బ్యాంకులు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.
2024లో జాబితాలో ఉన్న సిపిఎస్‌యుల వల్ల రెండింతలు ఆదాయం రానుంది.
2024లో జాబితాలో ఉన్న సిపిఎస్‌యుల వల్ల రెండింతలు ఆదాయం రానుంది.
దీంతో బడ్జెట్‌కు డబుల్ బొనాంజా అవుతుంది. దీంతో వీటి వాటా 2.11 ట్రిలియన్లు అవుతుందని ఆర్‌బిఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది డివిడెండ్, లాభాలు పబ్లిక్ సెక్టార్ నుండి రూ. 1.54 లక్షల కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని ఆర్‌బిఐతో సహా పలు సంస్థలు అంచనా వేశాయి.
గతేడాది 2023లో ప్రభుత్వరంగ సంస్థల నుండి డివిడెండ్‌లు, వాటి నుండి వచ్చిన లాభాలు రూ. 99,913 కోట్లుగా ఉంది. ఈ ఏడాది రూ.16,945.5 కోట్ల చెల్లింపుతో రిఫైనర్ ఇండియాన్ ఆయిల్ కంపెనీ (ఐఓసి) అతిపెద్ద డివిడెండ్ చెల్లింపుదారుగా ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది ఈ కంపెనీ చెల్లింపు దాదాపు 300 శాతం పెరిగింది.
దీని తర్వాత కోల్ ఇండియా (రూ.15,715 కోట్లు), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (రూ.15,411 కోట్లు), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (రూ.10,463 కోట్లు)లు డివిడెండ్ చెల్లింపుదారుగా నిలిచాయి. డివిడెండ్ల జాబితాలో ఉన్న 60 సిపిఎస్‌యుల లాభాలు 40.2 శాతం పెరిగి రూ. 4.69 లక్షల కోట్ల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. గతేడాది రూ. 3.35 లక్షల కోట్ల లాభాలు ఉన్నాయి.

More Stories
విద్యార్థుల కోసం ‘జెన్-జెడ్’ పోస్టాఫీస్‌లు
అమెరికా ఆంక్షలతో చమురు అమ్మకాలు ఆపేసిన రిలయన్స్
అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు