
ఈ నెల 30న లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద మూడు రోజులపాటు ధ్యానం చేయనున్నారు. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు.
30వ తేదీ నుంచి జూన్ ఒకటిన సాయంత్రం వరకు ఆయన ధాన్య మండపంలో ధ్యానం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ గుహలో ధాన్యం చేసిన విషయం తెలిసిందే. 2014లో శివాజీ ప్రతాప్ గఢ్ కు ప్రధాని మోదీ వెళ్లారు. కన్యాకుమారిని తన ఆధ్యాత్మిక విహారానికి వేదికగా ఎంచుకున్న ప్రధాని మోదీ నిర్ణయం దేశంపై వివేకానందుడి దార్శనికతను సాకారం చేయడంలో ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల తుది దశ పోలింగ్ జూన్ ఒకటి జరుగనున్నది. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రచారం ముగియనున్నది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి ప్రధాని మోదీ కన్యాకుమారి పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటన. ఆ సమయంలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు ఉండవు.
స్వామి వివేకానంద భరతమాత దర్శనం పొందిన ప్రదేశం కన్యాకుమారి. ఇది అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. స్వామి వివేకానంద జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉందని చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు ధ్యాన మండపంగా పిలువబడే ఈ ప్రదేశంలో గతంలో స్వామి వివేకానంద మూడు రోజులు ధ్యానం చేశారు. ఈ ప్రదేశం చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు. హిందూ పురాణాలలో కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. శివుడి కోసం ఎదురుచూస్తూ పార్వతీ దేవి ఈ ప్రదేశంలో తపస్సు చేసిందని నమ్ముతారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు