
జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ స్పేస్ టూర్ ప్రయోగం న్యూషెఫర్డ్ 25(ఎన్ 25) మిషన్‌లో తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. భూ గ్రహం వెలుపలికి ప్రయాణించిన రెండో భారతీయుడిగా, తొలి ఆంధ్రుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు స్పేస్ మిషన్లు పరిశోధనల్లో భాగంగానే జరుగుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా ప్రైవేట్ స్పేస్ యాత్రల్లో పర్యాటకుల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లుతున్నారు. ఇలా అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా తోటకూర గోపి రికార్డు సృష్టించారు.
అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8.5కు పశ్చిమ టెక్సాస్‌లోని బ్లూ ఆరిజన్ కంపెనీ లాంచ్ సైట్ నుంచి అంతరిక్ష వాహనం నింగిలోకి బయల్దేరింది. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యం ఇది బయలుదేరింది. విజయవాడలో జన్మించిన తోటకూర గోపి అమెరికాలో పారిశ్రామికవేత్తగా, పైలట్‌గా ఉన్నారు. మరో ఐదుగురితో కలిసి అంతరిక్ష యాత్రను చేపట్టారు.
భూ వాతావరణానికి వెలుపలికి వారితో కలిసి ప్రయాణించారు. వీరిలో 90ఏళ్ల ఎడ్ డ్వైట్ కూడా ఉన్నారు. మాసన్ ఎంజిల్, సిల్వియన్ చిరాన్, కెన్నెత్ ఎల్ హెస్, కారోల్ షల్లర్ తదితరులు అంతరిక్ష ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు. గోపి ఇప్పటికీ భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారు. అధికారికంగా అయితే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్రను చేపట్టిన రెండో భారతీయ అస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందారు.
బ్లూ ఆరిజిన్ అందించిన వివరాల ప్రకారం గోపి ఒక పైలట్‌గా, ఏవియేటర్‌గా ఉన్నారు. అతను డ్రైవింగ్ చేయడానికి ముందు ఎలా ఎగరాలో నేర్చుకున్నాడు. హార్ట్స్ ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో హోలిస్టిక్ వెల్ నెస్ అండ్ అప్లైడ్ హెల్త్ గ్లోబల్ సెంటర్ ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ ను 30 ఏళ్ల గోపీ స్థాపించారు.
వాణిజ్యపరంగా జెట్ విమానాలను నడపడంతో పాటు బుష్, ఏరోబాటిక్, సీప్లేన్లతో పాటు గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను నడుపుతూ అంతర్జాతీయ మెడికల్ జెట్ పైలట్‌గా గోపి సేవలందించారు. ఇటీవల టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో శిఖరానికి కూడా వెళ్లారు. తోటకూర ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
సూయజ్ టి-11 ద్వారా 1984 ఏప్రిల్ 3న అంతరిక్ష యాత్ర చేసిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ గుర్తింపు పొందారు. సోవిషట్ యూనియన్ ఇంటర్ కాస్మోట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన ఈ యాత్రను చేశారు. భారతీయ మూలాలు ఉన్నా కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వంటి వారు కూడా గతంలో అంతరిక్షంలో ప్రయాణించారు.
భారతీయ మూలాలు ఉన్న వారంతా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ప్రొఫెషనల్ అస్ట్రోనట్స్గా అంతరిక్షంలోకి ప్రయాణించారు. ఎన్ఎస్ 25 వాహనం ద్వారా నింగిలోకి వెళ్లిన అంతరిక్ష పర్యాటకులు భూ బాహ్య కక్ష వరకు ఎలాంటి అటంకాలు లేకుండా ప్రయాణించారు. ఆ తర్వాత రాకెట్‌తో పాటు క్యాప్సూల్ భూమికి తిరుగు ప్రయాణమైంది.
రాకెట్ ల్యాండ్ అయిన కాసేపటికి క్యాప్సూల్ కూడా సురక్షితంగా పారాచూట్ల సాయంతో నేలను తాకింది. దీనికి 15 నిమిషాల సమయం పట్టింది. జెఫూ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ కంపెనీ రెండేళ్ల క్రితం అంతరిక్ష యాత్రలు చేపట్టింది. క్యాప్సూల్ టచ్ టౌన్, వెల్కమ్ బ్యాక్ ఎన్25 అంటూ బ్లూ ఆరిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
బ్లూ ఆరిజిన్ ఏడోసారి చేపట్టిన స్పేస్ టూర్లో పర్యాటనకులతో కూడిన విమానం ఎన్ఎస్-25 ఆదివారం ఉదయం వెస్ట్ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుంచి బయలుదేరిందని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. బ్లూ ఆరిజిన్ తన ఏడవ మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు