ఆప్ కు రూ.133 కోట్ల విరాళాలు ఇచ్చామన్న ప‌న్నున్

ఆప్ కు రూ.133 కోట్ల విరాళాలు ఇచ్చామన్న ప‌న్నున్
ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సుమారు 133.54 కోట్ల డ‌బ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీలు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ప‌న్నున్ తెలిపారు. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. 
 
దేవింద‌ర్ పాల్ సింగ్ బుల్లార్ రిలీజ్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ఆ వీడియోలో ప‌న్నున్ ఆరోపించారు. 1993 ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు.  ప్రస్తుతం ఢిల్లీ మద్యం కేసు దేశంలో తీవ్ర సంచలనం రేపుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది చేస్తున్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. 
 
ఉగ్రవాదిని విడుదల చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నట్లు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉండి అరెస్ట్ అయిన దేవింద‌ర్ పాల్ సింగ్‌ బుల్లార్‌ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్ డ‌బ్బులు తీసుకున్నారని ఆ వీడియోలో ఆరోపించారు. 
 
1993 ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన దేవింద‌ర్ పాల్ సింగ్‌‌ ఖలిస్తాన్ ఉగ్రవాది కాగా.. ఆ కేసులో అతనికి మరణశిక్ష పడింది. ఆ తర్వాత శిక్షను జీవిత ఖైదుగా మార్చగా.. గత 20 ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు.  ఇక ఆప్‌కు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ సంస్థ ప్రతినిధులతో కేజ్రీవాల్ భేటీ అయ్యారని కూడా పన్నూన్ ఆరోపించారు. 
 
2014 లో అమెరికాలోని న్యూయార్క్‌లో ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో కేజ్రీవాల్ సమావేశం అయ్యారని వీడియో ద్వారా వెల్లడించారు. గురుద్వారా రిచ్ మండ్ హిల్స్‌లో ఈ భేటీ జరిగిందని స్పష్టం చేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్నూ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి.
 
మ‌రో వైపు మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. క‌స్ట‌డీలోనే ఉంటూనే సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగిన స‌మ‌యంలో కేజ్రీవాల్ వాడిన ఫోన్ ప్ర‌స్తుతం మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా, 2022 ఫిబ్రవరి 17న, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ నుండి వచ్చిన లేఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొట్టింది.  దీనిలో సంస్థ చీఫ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌కు మద్దతు ప్రకటించారు.
 
ఆ లేఖపై సంతకం గురుపత్వంత్ సింగ్ పన్నూ సంతకం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కి ఓటు వేయాలని ప్రజలను కోరారు. తద్వారా వారు మరోసారి తమ లక్ష్యాన్ని (ఖలిస్తాన్) రూపం దాల్చేటట్లు చేసుకోవాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. పైగా, 2017 అసెంబ్లీ ఎన్నికలలో సహితం తాము ఆప్ కు మద్దతు తెలిపినట్లు ఆ లేఖలు వెల్లడించారు.