తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడిన ఓ వ్యక్ సింహతో సెల్ఫీ కోసం ప్రయత్నం చేసాడు. ఈ సమయంలో ఒక్కసారిగా సింహం దాడి చేసేందుకు ప్రయత్నించింది. భయపడిన అతను చెట్టుపైకి ఎక్కగా దానిపై నుంచి కిందపడటంతో సింహం అతని తల భాగంపై దాడి చేసి చంపేసింది.
ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడి చేసిన సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్ బంధించారు. చనిపోయిన వ్యక్తి గేటును దాటుకుని లోనికి వెళ్లి సింహాలకు ఆహారం వేసే ప్రాంతం నుంచి బోనులోకి దూకినట్లు సమాచారం. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు. డీఎస్పీ శరత్ రాజ్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
మరోవైపు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ప్రహ్లాద్.. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో అతడు సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జూలో రెండు మగ సింహాలు, ఒక ఆడ సింహం ఉన్నాయి. ఒక మగ సింహం ఉన్న ప్రాంతంలోకి ప్రహ్లాద్ వెళ్లడంతో అది దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రహ్లాద్ విశ్వ ప్రయత్నం చేసుంటాడని మృతదేహాన్ని చూస్తే అర్థమవుతుంది.

More Stories
పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రాకకు పటిష్ట ఏర్పాట్లు
ఏపీకి తక్షణ సాయంగా రూ. 901 కోట్లు ఇవ్వండి
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి