
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్‌లు 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. 227 దేశాల జాబితాలో ఈ ఆరు దేశాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ పాస్‌పోర్ట్‌లతో 194 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) అందించిన సమాచారం ఆధారంగా ‘హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ’ జాబితాను విడుదల చేసింది. వీసా లేకుండా ప్రయాణించే పర్యాటకుల సంఖ్య 2006లో 58 నుండి 2024 నాటికి 111కి చేరిందని, దాదాపు రెట్టింపు అయిందని హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ రూపకర్త క్రిస్టియన్ హెచ్ కైలీన్ తెలిపారు.
గత అయిదేళ్ల నుంచి జపాన్, సింగపూర్ దేశాల మధ్య నెంబర్ వన్ స్థానం కోసం పోటీ ఉండేది. అయితే ఈసారి యురోపియన్ దేశాలు ర్యాంకుల్లో మెరుగైనట్లు తెలుస్తోంది. ఫిన్‌ల్యాండ్, స్వీడెన్, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశ పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.
ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ సహా 62 దేశాలకు వీసాలేకుండానే పర్యాటకులు ప్రయాణించవచ్చు. గతేడాది భారత్ 85 స్థానంలో ఉండగా, 59 దేశాలకు మాత్రమే ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతించాయి. ఉజ్బెకిస్థాన్‌తో పాటు పొరుగునే ఉన్న పాకిస్థాన్‌లు 101వ స్థానంలో నిలవగా, ఆఫ్ఘనిస్థాన్ (104 ) చివరి స్థానంలో నిలిచింది.
More Stories
లండన్‌లోని ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
ఐరాస మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నిక
మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్ఘాన్ సరిహద్దు.. కాల్పుల విరమణ