ఉక్రెయిన్ దాడిలో ర‌ష్యా యుద్ధ నౌక ధ్వంసం

ఉక్రెయిన్ దాడిలో ర‌ష్యా యుద్ధ నౌక ధ్వంసం

ఉక్రెయిన్‌ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని రష్యా నౌక ధ్వంసమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ర‌ష్యా ఆక్ర‌మిత క్రిమియాలో ఉన్న ఫెడోసియా పోర్టు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అతి భారీ నౌక నోవోచెర‌క‌స‌క్‌పై ఉక్రెయిన్ విమానం మిస్సైళ్ల‌తో దాడి చేసిన‌ట్లు ర‌ష్యా చెప్పింది. ఆ నౌక‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఇటీవ‌లనే ఉక్రెయిన్ వైమానిక ద‌ళం పేర్కొన్నది.  ఫియోడోసియా నగరంలో ల్యాండ్‌ చేసిన నొవొచెర్కాస్క్‌ నౌకను ఉక్రెయిన్‌ విమానం ప్రయోగించిన క్షిపణులు ధీ  కొట్టాయని రష్యా పేర్కొంది.

దాడి వ‌ల్ల నౌక‌లో ఉన్న ఆరు బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయ‌ని, తాత్కాలిక ఆశ్ర‌య కేంద్రాల‌కు కొంత‌ మందిని తీసుకెళ్లిన‌ట్లు క్రిమియా అధికారులు చెప్పారు.యుద్ధ‌నౌక డ్యామేజ్ చేసిన త‌ర్వాత ర‌ష్యా ప్ర‌తీకార దాడికి పాల్ప‌డింది. ఉక్రెయిన్‌కు చెందిన రెండు సుఖోయ్‌-24 జెట్ విమానాల‌ను ర‌ష్యా పేల్చివేసింది. ఆ జెట్ల‌ను నికోలేవ్ సిటీ వ‌ద్ద కూల్చిన‌ట్లు ర‌ష్యా తెలిపింది.

గత కొన్ని నెలలుగా, ఉక్రెయిన్‌ దళాలు అధికంగా సముద్ర డ్రోన్‌లను వినియోగించి క్రిమియా పై దాడులు చేపట్టాయని తెలిపారు. నల్లసముద్రంలో నావిగేషన్‌ను పునరుద్ధరించడానికి ఉక్రెయిన్‌ను అనుమతించడంతో పాటు మిలియన్‌ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడులకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు.