తెలంగాణలో బీజేపీ తొలి బోణీ కొట్టింది. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి శ్రీహరి రావుపై విజయం సాధించారు.బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి సుమారు 16వేల ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఇదిలా ఉండగా దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ చేజార్చుకుంది. రఘునందన్ రావు ఓటమి చవిచూశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

More Stories
సింగరేణి టెండర్ల రద్దు కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం
పెండింగ్ చలాన్ల కోసం కీస్ తీసుకోవద్దు, బైక్ లాక్కోవద్దు
వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ