
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నది. మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఎథిక్స్ కమిటీ రూపొందించిన తీర్మానాన్ని కమిటీ ఆమోదించిందినట్లు ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ సోన్కర్ తెలిపారు.
గురువారం జరిగిన సమావేశంలో ఆ నివేదికటుపై తీర్మానం చేశామని, ఆ తీర్మానానికి ఆరుగురు సభ్యులు ఆమోదం తెలిపారని, మరో నలుగురు సభ్యులు దాన్ని వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్ కు చాలా సవివరమైన నివేదికను శుక్రవారం అందించనున్నట్లు, అయితే తుది నిర్ణయం స్పీకరే తీసుకుంటారని వినోద్ వెల్లడించారు.
కాగా, ఎథిక్స్ కమిటీ ఫిక్స్ అయినట్లు వస్తున్న ఆరోపణలను వినోద్ ఖండించారు. ఎంపీపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే మొదటిసారని లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ ఆచార్య తెలిపారు.
‘ఓ ఎంపీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయటం ఇదే మొదటిసారి’ అని లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ పీడీటీ ఆచార్య అన్నారు. ‘తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై ఓటింగ్ జరిపి సదరు ఎంపీపై కేంద్రం బహిష్కరణ వేటు వేయొచ్చు’ అని ఆచార్య అభిప్రాయపడ్డారు.
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మహువా మొయిత్రా పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మోయిత్రాను బహిష్కరించాలని సిఫార్సుకు మద్దతుగా అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకార్, హేమంత్ గాడ్సే ఉన్నారు. ఇక వ్యతిరేకించిన వారిలో డానిష్ అలీ, వైతిలింగం, పీఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ తదితరులున్నారు.
తనను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తే తిరిగి భారీ మెజార్టీతో గెలిచి సభలో అడుగుపెడతానని ఎంపీ మొయిత్రా ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా బీజేపీ-అదానీ వ్యవహారంపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేయసారు. ఎథిక్స్ కమిటీ విచారణపై మాట్లాడుతూ ‘వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అయినా నన్ను ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని క్రాస్-ఎగ్జామినేషన్ చేయలేదు. బహుమతులు అందాయన్న దానికి ఒక్క ఆధారమూ చూపలేదు’ అని ఆమె విమర్శించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు