అద్భుత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ అయ్యంగార్ రామానుజన్

అద్భుత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ అయ్యంగార్ రామానుజన్
భవాని శంకర్                                                                                                                                                                 * పుణ్యతిధి నివాళి
చిన్న వయస్సులోనే మృతి చెందినా ప్రపంచంలోనే అద్భుతమైన గణిత శాస్త్రవేత్తగా పేరొందిన శ్రీనివాస రామానుజం సంఖ్యా సిద్ధాంతం, విధులు, అనంతమైన శ్రేణులకు సహకారం అందించిన భారతీయ గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు.  ఈ గొప్ప భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు 2012లో నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ప్రకటించారు. 
 
శ్రీనివాస అయ్యంగార్ రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ఈరోడ్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు శ్రీనివాస్ అయ్యంగార్,  తల్లి పేరు కోమలతమ్మాళ్. రామానుజన్‌కి ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు, అతని కుటుంబం కుంభకోణంలో స్థిరపడింది. 
 
అతని తండ్రి స్థానిక వ్యాపారవేత్త వద్ద అకౌంటెంట్‌గా పనిచేసే వాడు. మొదట్లో రామానుజన్ మేధో వికాసం మిగతా పిల్లలలాగా లేకపోవడంతో మూడేళ్ల వరకు మాటలు రాకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. రామానుజన్ ప్రాథమిక విద్యను కుంభకోణంలోని ప్రాథమిక పాఠశాల నుండి పొందారు. 
తరువాత, మార్చి 1894లో, రామానుజన్ తమిళ-మీడియం పాఠశాలలో చేరాడు. కానీ మొదటి నుండి, రామానుజన్ గణితంపై చాలా మక్కువ చూపేవాడు. దానితో అతనికి ఇతర అంశాలపై ఆసక్తి కలిగేది కాదు.  అతను 10 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పరీక్షలో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించాడు.
 
 తదుపరి విద్య కోసం, రామానుజన్ టౌన్ హైస్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. మొదటి నుండి, అతను చాలా మంచి విద్యార్. థి సున్నితమైన (తెలివైన) స్వభావం గల పిల్లవాడు. రామానుజన్‌కి గణితం, ఇంగ్లీషులో మంచి మార్కులు రావడంతో స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. క్రమంగా రామానుజన్ గణితంలో ప్రావీణ్యత సాధించి ఇతర సబ్జెక్టులు కూడా చదవడం మానేశాడు. దీంతో గణితం తప్ప మిగతా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు.12వ తరగతిలో  ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత 1907లో 12వ తరగతి  పరీక్షలో మళ్లీ ఫెయిల్ అయ్యాడు.

రామానుజన్ కు తల్లిదండ్రులు  వివాహం నిశ్చయించారు. రామానుజన్ భార్య పేరు జానకి. రామానుజన్ వివాహం 1909లో జరిగింది. అప్పుడు రామానుజన్ వయస్సు 21 సంవత్సరాలు. జానకి వయస్సు 9 సంవత్సరాలు. అయితే చిన్న పిల్ల కావటం వలన పెళ్లయిన తర్వాత జానకి తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు కొంత కాలం వెళ్ళిపోయింది.

తరువాత 1912లో రామానుజన్‌కి మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ లో గుమాస్తా ఉద్యోగం వచ్చినప్పుడు జానకి అతనితో కలిసి జీవించడానికి వచ్చింది. రామానుజన్ స్వతహాగా సిగ్గుపడేవాడు. స్వచ్ఛమైన మనస్సు కలవాడు. అందువల్ల, జానకి రామానుజన్ చివరి రోజుల వరకు సేవ చేస్తూనే ఉంది. రామానుజన్ మరణానంతరం తిరిగి వివాహం చేసుకోలేదు.

రామానుజన్ 13 సంవత్సరాల వయస్సులో రాసిన అడ్వాన్స్‌డ్ త్రికోణమితి పుస్తకానికి తిరుగులేని మాస్టర్ అయ్యాడు.  అనేక సిద్ధాంతాలను స్వయంగా సృష్టించాడు. కేవలం 17 సంవత్సరాల వయస్సులో, అతను బెర్నౌలీ సంఖ్యలను పరిశోధించాడు. 15 దశాంశ స్థానాల వరకు యూలర్ స్థిరాంకం విలువను కనుగొన్నాడు.

 
1910లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వ్యవస్థాపకుడు వి రామస్వామి అయ్యర్‌తో సమావేశమైన తర్వాత మద్రాసు గణిత శాస్త్రాలలో గుర్తింపు పొందడం ప్రారంభించాడు.  మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా చేరడానికి దారితీసింది.  రామానుజన్ తన 33 సంవత్సరాల జీవితంలో 3900 కంటే ఎక్కువ సమీకరణాలను సంకలనం చేసాడు. అతని సమీకరణాలలో అత్యంత ముఖ్యమైన, ఉపయోగకరమైన అల్గోరిథం పై సిరీస్. 1729 అనేది 10,  9 ఘనాల మొత్తం కనుక రెండు సంఖ్యల ఘనాలను రామానుజన్ సంఖ్యలుగా పరిగణిస్తారు. అందుకే 1729ని రామానుజన్ నంబర్ అంటారు.

1918 సంవత్సరంలో, 31 ​​సంవత్సరాల వయస్సులో, రామానుజన్ 120 గణిత సూత్రాలను వ్రాశారు. వాటిని ఆంగ్ల ప్రొఫెసర్ జి.హెచ్. హార్డీకి పరిశీలనకు పంపగా, హార్డీ ఆ గణిత సూత్రాలకు ముగ్ధుడయ్యాడు.  హార్డీ రామానుజన్‌ను కేంబ్రిడ్జ్ (ఇంగ్లాండ్ ) విశ్వవిద్యాలయానికి ఆహ్వానించాడు. అక్టోబర్ 1918లో, రామానుజన్ ట్రినిటీ కాలేజీలో సభ్యత్వం పొందిన మొదటి భారతీయుడు.

 
1914లో ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ హార్డీ పర్యవేక్షణలో కొన్ని పరిశోధనలు సాగించారు. 1903 నుండి 1914 సంవత్సరాలలో తనకు తానుగా కనుగొన్న వేలాది గుర్తింపులు, సమీకరణాలు,  సిద్ధాంతాలతో నిండిన తన నోట్‌బుక్‌లను భారతదేశం నుండి తీసుకువచ్చాడు.  గణితంలో సాధికారికంగా చెప్పుకోదగిన శిక్షణ పొందకపోయినా అపారమైన మేధస్సుతో అందరిని ఆశ్చర్య పరచేవారు. హార్డీ, లిటిల్‌వుడ్‌లతో కలిసి కేంబ్రిడ్జ్‌లో సుమారు 5 సంవత్సరాలు గడిపాడు. అక్కడ తన పరిశోధనలలో కొంత భాగాన్ని ప్రచురించాడు.
 
రామానుజన్ టిబి (క్షయ) కారణంగా అక్టోబర్ 1920 లో మరణించాడు. రామానుజన్ మరణించినప్పుడు, అతని వయస్సు కేవలం 33 సంవత్సరాలు. ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రామానుజన్ తన 33 సంవత్సరాల జీవితంలో 3884 కంటే ఎక్కువ సమీకరణాలు చేశాడు.