చైనా చంద్రమండలం యాత్రలో పాక్ ఉపగ్రహం

చైనా చంద్రమండలం యాత్రలో పాక్ ఉపగ్రహం

వచ్చే ఏడాది 2024లో చైనా చేపట్టే చంద్రమండల యాత్ర ఛాంగే లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహం పేలోడ్‌గా ఉంటుంది. అన్ని కాలాల స్నేహబంధం సాగిస్తున్న చైనా, పాకిస్థాన్‌లు ఇప్పుడు స్పేస్ రంగంలోనూ తమ అనుబంధం చాటుకుంటున్నాయి. 

తమ తదుపరి లూనార్ మిషన్‌లో పాకిస్థాన్‌లో రూపొందించిన సూక్ష్మస్థాయి క్యూబ్‌శాట్ శాటిలైట్‌ను తీసుకువెళ్లుతున్నట్లు చైనా జాతీయ అంతరిక్ష నిర్వాహక సంస్థ (సిఎన్‌ఎస్‌ఎ)ను ఉటంకిస్తూ అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకటన వెలువరించింది. తమ తదుపరి లూనార్ మిషన్ అత్యంత కీలకమైన అంతరిక్ష ప్రయోగం అవుతుందని చైనా అంతరిక్ష విభాగం తెలిపింది. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు విస్తృత స్థాయిలో అధ్యయనం, పలుస్థాయిల నిర్మాణ కార్యక్రమాలు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. భారతదేశం ఇటీవలే చంద్రయాన్ భారతదేశం ఇటీవలే చంద్రయాన్ 3ను విజయవంతం చేసిన నేపథ్యంలో చైనా తమ ప్రతిష్టాత్మక ఛాంగే ప్రాజెక్టును వేగవంతం చేసింది. చైనా శాటిలైట్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేసుకుంది. 

పాకిస్థాన్ ఒక్కటే కాకుండా ఇతర దేశాలకు చెందిన పేలోడ్స్‌ను కూడా ఈ లూనార్ మిషన్‌లో తీసుకువెళ్లుతున్నట్లు చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. ఫ్రాన్స్‌కు చెందిన డోర్న్ రాడాన్ డిటెక్షన్ పరికరం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన నెగెటివ్ ఐయాన్ డిటెక్టర్ , ఇటలీ రెట్రోరెఫ్లెక్టర్ వంటివి చైనా వ్యోమనౌకలో పేలోడ్స్‌గా ఉంటాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై మరింతగా పరిశోధనలకు చైనా ప్రయోగం తలపెట్టారు.