
మొదటి ఎడిషన్ కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు తెలంగాణాలో 2వ ఎడిషన్ తీసుకొస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఈ ఎడిషన్‌ను సెప్టెంబర్ 29, 30 & అక్టోబర్ 1న నిర్వహిస్తున్నట్లు సిటిజెన్ గ్రూప్ సీఈఓ స్వాతి చంద్రశేఖర్ తెలిపారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టే ముందు మొదటి అడుగు వేయడానికి సిటిజన్ యూత్ పార్లమెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని ఆమె తెలిపారు.
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులందరూ ఈ యూత్ పార్లమెంటులో పాల్గొనవచ్చు. దీనిలో పాల్గొనే ఆసక్తి గలవారు గూగుల్ లోకి వెళ్లి ఫారం నింపు ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. సిటిజెన్ గ్రూప్ నిపుణుల బృందం నిర్వహించే ఇంటర్వ్యూ ను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంపికైన వారు సిటిజన్ యూత్ పార్లమెంటులో పాల్గొనవచ్చు.
ఇందులో పాల్గొనేవారికి న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యూత్ పార్లమెంటులో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. యూత్ పార్లమెంట్‌లో అద్భుతంగా మాట్లాడినవారిని, మెరుగైన ప్రతిభ కనబర్చినవారిని వారు ఎంపిక చేసి గ్రాండ్ వ్యాలిడక్టరీ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తులను పంపుకోవాల్సి ఉంటుంది.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!