వేగంగా పెరుగుతున్న జనాభా సామర్థ్యాన్ని వెలికితీయడం, శ్రామిక శక్తిలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అలాగే దాని అపారమైన ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాలను అందించడం కీలకమని సేన్‌గుప్తా చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యల్ప డిపెండెన్సీ నిష్పత్తులలో ఒకటిగా ఉంటుందని కూడా ఆయన అంచనా వేశారు.
”తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలలో భారతదేశం సరైన అవకాశాలు పొందడానికి అనుగుణంగా ఉంటుంది” అని సేన్‌గుప్తా చెప్పారు. పడిపోతున్న డిపెండెన్సీ నిష్పత్తులు, పెరుగుతున్న ఆదాయాలు, లోతైన ఆర్థిక రంగ అభివృద్ధితో, అనుకూలమైన జనాభాల కారణంగా భారతదేశ పొదుపు రేటు పెరుగుతుందని భావిస్తున్నారు.
“ఈ విషయంలో, ప్రభుత్వం ఇటీవలి కాలంలో భారీ లిప్టిగ్ చేసింది. కానీ భారతదేశంలోని ప్రైవేట్ కార్పొరేట్లు, బ్యాంకుల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లను బట్టి, ప్రైవేట్ రంగ క్యాపెక్స్ సైకిల్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము” అని నివేదిక పేర్కొంది. అదే సమయంలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరగకపోతే భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ప్రతికూల ప్రమాదం అవుతుందని నివేదిక హెచ్చరించింది.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం