
హైదరాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు బయటపడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల దాడులు చేపట్టిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురిని అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ లింక్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంతో సూరత్‌కు చెందిన సబెర భాను, హైదరాబాద్‌కు చెందిన ఖదీజా అలియాస్ అబిదాను కొద్దిరోజుల క్రితం గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్‌కేపీ విస్తరణకు దేశవ్యాప్తంగా ఈ ఇద్దరు మహిళలు నెట్‌వర్క్ పెట్టుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుబేర, అబిదా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పటికే యూత్ను ఐఎస్‌కేపీలో చేర్చుకున్నారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులతో కూడా ఈ మహిళలిద్దరూ సంప్రదింపులు జరిపినట్లుగా గుర్తించారు. హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, పలువురిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించారనే వార్తలతో రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక వీరిద్దరి సీడీఆర్ ను గుజరాత్ ఏటీఎస్ పరిశీలించింది. గుజరాత్, జమ్ముకశ్మీర్, యూపీ, తెలంగాణలో నెట్‌వర్క్ విస్తరించాలని ప్రణాళిక రచించారు.
గుజరాత్లో ఇంతకుముందే అరెస్ట్ అయిన నలుగురు ఉగ్రవాదులతో సుబేర అనే మహిళ ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. అలాగే అప్ఘనిస్తాన్‌లో ఫిదాయిన్ దాడులకు సుబేర ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ విచారణలో బట్టబయలైంది. సుబెర, అభిధాలు గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఒక బోట్‌ను హైజాక్ చేసి ఆఫ్ఘనిస్థాన్‌కు కూడా వెళ్లాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి