
కాగా, పలువురు భక్తులు రాముడిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. డబ్బు, వస్తు రూపంలో కానుకలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు.
108 అడుగుల పొడవు, 3403 కిలోల బరువున్న అగరబత్తిని తయారు చేసి శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. విహాభాయ్ భర్వాడ్ నేతృత్వంలో ఈ అగరబత్తిని పంచద్రవ్యాలతో తయారు చేశారు. దీని తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1,475 కిలోల ఆవుపేడను వాడారు.
ఈ బాహుబలి అగరబత్తి తయారీకి రెండు నెలల సమయం పట్టినట్లు విహాభాయ్ భర్వాడ్ తెలిపారు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చైనట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ బాహుబలి అగరబత్తిని అయోధ్యకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు విహాభాయ్ వివరించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్