
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత వెల్లడించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ఫ్లాగ్‌షిప్ క్యాంపెయిన్‌ను, దీనిపై ప్రధాని మోదీ దార్శకనితను సుందర్ పిచాయ్ కొనియాడారు.
“అమెరికాలో చారిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది. భారత్ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు(రూ. 8.19 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోదీతో పంచుకున్నాం. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాము” అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
పిచాయ్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, ఏఎమ్‌డీ సీఈవో లిసాసు తదితర అగ్రశ్రేణి సీఈవోలతో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
“ఈరోజు మేము గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాము. ఇది భారతదేశం ఫిన్‌టెక్ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది, యూపీఐ, ఆధార్‌కు ధన్యవాదాలు. మేము ఆ పునాదిపై నిర్మించి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లబోతున్నాము’ అని పిచాయ్ చెప్పారు.
ముఖ్యంగా డిజిటల్ ఇండియా దార్శనికత, ఆర్థిక అవకాశాల చుట్టూ దేశం సాధించిన పురోగతిని చూడటం చాలా ఉత్సాహంగా ఉందని భారతీయ సంతతికి చెందిన సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.
More Stories
సైబర్ నేరాలపై ఆర్బిఐ ప్రత్యేకంగా బ్యాంక్.ఇన్ డొమైన్
వందే భారత్ రైలులో ఆన్‌బోర్డ్‌లో కూడా ఆహారం
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు