
Choose mobile phone. Heap of the different smartphones. 3d
కానీ, 2022-23లో రూ. 88,726 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు జరిగాయని తెలిపింది. స్మార్ట్ ఫోన్లకు మూడు రకాలైన హెచ్ఎస్ కోడ్స్ కలిగి ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1,20,000 కోట్ల నుంచి 2026 నాటికి ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లకు చేరుతాయని ఐసీఈఏ అంచనా వేసింది.
స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో ప్రధానంగా సగం వాటా యాపిల్ ఐఫోన్లదే. దీని తరువాత శామ్సంగ్ ఫోన్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. 2026 నాటికి మన దేశంలో 25 శాతం ఐఫోన్లు తయారవుతాయని అంచనా. ఇది 20 బిలియన్ డాలర్లకు సమానం. స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 5వ స్థానంలో ఉంటే, గ్యాసోలిన్ ఎగుమతులు 4వ స్థానంలో ఉంది. రూ. 1,19,716 కోట్ల విలువైన గ్యాసోలిన్ ఎగుమతులు జరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం నెలకొన్నందున ఈ సారి డైమండ్స్ ఎగుమతులు 10-15 శాతం వరకు తగ్గాయి. అయితే ఎగుమతి చేస్తున్న స్మార్ట్ ఫోన్లలో దిగుమతి చేసుకుంటున్నవి విలువ జోడింపులో 12-18 శాతం వరకు మాత్రమే ఉన్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్ఐ) స్కీమ్‌లో ప్రోత్సహకాలు అందించడం ద్వారా ఇది 40 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు