
అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాగా, తుఫాను ఇప్పుడు దేవభూమి ద్వారక నుండి 380 కి.మీ దూరంలో ఉంది. 15 నాటికి గుజరాత్‌లోని జఖౌ ఓడరేవును దాటే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యల గురించి అన్నతాధికారులతో చర్చించారు. అలాగే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయా రాష్ట్రాలను ప్రధాని కోరారు. ఈ తుఫాను ప్రభావం భారతదేశపు పశ్చిమతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉన్నది. దాంతో మహారాష్ట్ర, గుజరాత్ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం మీదుగా తీరంవైపు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దాంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
ఇక దాయాది దేశం పాకిస్థాన్‌లో అయితే ఈ బిపర్‌జోయ్ తుఫాను బీభత్సం సృస్టిస్తున్నది. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుఫాను ఉత్తరదిశగా ప్రయాణిస్తూ పాకిస్థాన్ తీరాన్ని తాకింది. ఈ తుఫాను ప్రభావంతో పాకిస్థాన్‌లోని పలు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దాంతో అక్కడ ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నది. తుఫాను ధాటికి పాకిస్థాన్‌లో ఇప్పటికే 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. అయితే, మన దేశంపై ఈ తుఫాను ప్రభావం అంతగా లేనప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా ఉంది. అందుకే మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
తుఫాను కారణంగా అనేక విమానాలు కూడా దెబ్బతిన్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలకు ల్యాండ్ చేసే పరిస్థితి లేక మరో ఎయిర్‌పోర్టుకు దారిమళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ శాఖ ఇప్పటికే మహారాష్ట్రను అలర్ట్ చేసింది. తుఫాను కారణంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ సమయంలో ముంబైలో తుఫాను వచ్చి చాలా చెట్లు నేలకూలాయి. తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిందని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాతావరణ పర్యవేక్షణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం బైపోర్‌జోయ్ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుపాను కారణంగా ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.
More Stories
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్
ఈ20 బ్లెండింగ్ పై సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్
ఐశ్వర్య ఫొటోలు వాడితే కఠిన చర్యలు