
ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6-2, 5-7, 6-4తో అన్‌సీడెడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది.
దీంతో వరుసగా రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకుంది. గతంలో స్వియాటెక్ 2020, 2022లో ఇక్కడ విజేతగా నిలిచింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో ఇరువురు ప్లేయర్లు ప్రతీ పాయింట్ కోసం ప్రాణం పెట్టి పోరాడారు.
తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన స్వియాటెక్‌కు, రెండో సెట్‌లో ముచోవా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ముచోవా చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. ఒత్తిడిని చిత్తు చేస్తూ కీలక పాయింట్లు నెగ్గిన స్వియాటెక్ చాంపియన్‌గా అవతరించింది.
విజయం సాధించిన అనంతరం స్వైటెక్ మాట్లాడుతూ ముఛోవా అద్భుతమైన ప్లేయర్. వైవిధ్యమైన ఆటతో ఓ దశలో తనపై ఆధిపత్యం చెలాయించింది. పట్టుదలకు ఆమె మారుపేరు అని పేర్కొంది.
ఈ ఏడాది జరిగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంటే హెనిన్, క్రిస్ ఎవర్ట్, స్టెఫీగ్రాఫ్, మోనికా సెలెస్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణుల జాబితాలో చేరనుంది. కెరీర్‌లో 5వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్వైటెక్.. ఈ టోర్నమెంట్‌లో సబలెంకా, రైబకినా వంటి యువ క్రీడాకారిణుల త్రయంతో నూతన అధ్యాయాన్ని లిఖించనుంది. టైటిల్ విజేతగా నిలవడంతో 22ఏళ్ల స్వైటెక్ తన టాప్‌సీడ్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?