నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ

నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ

ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ  ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని  ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజాగా,  నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ భారత్ ను సందర్షించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని మోదీని ప్రశంసించారు. ఆయన ప్రపంచానికి చేస్తున్న సేవలను కొనియాడుతూ నోబెల్ శాంతి బహుమతికి పోటీలో ఉన్నవారిలో మోదీ ప్రముఖుల్ని వెల్లడించారు.

యుద్ధాలు చేసే దేశాల చేత కూడా యుద్ధాలను ఆపించగల సత్తా ఉన్నవాడని ప్రధానిని కొనియాడారు. మోదీలాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పే సామర్థ్యం ఉందని కితాబిచ్చారు. మోదీ లాంటి నేత శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే వెల్లడించారు.

రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్దానివారణకు మోదీ చేస్తున్న కృషిని కొనియాడుతూ పోరాడుకొంటున్న దేశాల మధ్య యుద్ధాలను ఆపి, శాంతిని నెలకొల్పగల అత్యంత విశ్వసనీయ నేత మోదీ అని ఆయన ప్రశంసించారు.  మోదీ విధానాల వల్ల భారత్ సుసంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా మారుతోందని అస్లే పేర్కొన్నారు. ప్రపంచాన్ని నడపగల గొప్ప అర్హత ఉన్న  నాయకుడైన ప్రధాని మోదీ.. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటే అది చారిత్రాత్మకం అవుతుందని చెప్పారు. కాగా, అక్టోబరు మాసంలో నోబెల్ అవార్డులు ప్రకటించనున్నారు.