
ఇప్పటికే ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ స్కామ్, పశువుల స్మగ్లింగ్ కేసులతో సతమతమవుతున్న మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం మరో రూ 876 కోట్ల భూకుంభకోణంలో కూడా చిక్కుకున్నట్లు పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి సంచలన ఆరోపణ చేశారు. తన ఆరోపణలకు ఆధారంగా కొన్ని డాక్యుమెంట్లను కూడా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
తన ట్వీట్లను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ట్యాగ్ చేశారు. ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను, ఈడీని కోరారు. అలీపుర్ లోని కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కు చెందిన 5.6 ఎకరాల భూమిని అలీపుర్ గ్రీన్ సిటీ డవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద విలువ తక్కువ చేసి ఇవ్వడంతో ఖజానాకు రూ.876 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.
ఫోనిక్స్ మిల్స్ అనుబంధ సంస్థ అయిన పల్లాడియం కన్‌స్ట్రక్షన్ అలిపోర్‌లో ఈ ప్రైమ్ ల్యాండ్‌ను రూ.414 కోట్లకు సేకరించిందనీ, నిజానికి మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి విలువ రూ.1290 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై గవర్నర్ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కోరారు.
కాగా, సువేందు అధికారి ఆరోపణలపై మమతా బెనర్జీ సర్కార్ స్పందించాల్సి ఉంది. వివిధ కేసుల్లో ఇప్పటికే పలువురు టీఎంసీ నేతలు అరెస్టు అయ్యారు. పశువుల స్మగ్లింగ్ కుంభకోణంలో ప్రస్తుతం జైలులో ఉన్న టీవీసీ దిగ్గజనేత అనుబ్రత మోండల్‌కు సన్నిహితుడు, ఛార్టెట్ ఎకౌంటెంట్ అయిన మనీష్ కొఠారిని గత మంగళవారంనాడు ఈడీ సుమారు 10 గంటల సేపు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది.
More Stories
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్
శబరిమల ఆలయం బంగారు మాయంపై క్రిమినల్ కేసు