సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
2018-19 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 122.498 మిలియన్‌ టన్నుల లోడింగ్‌ను అధిగమించి 8 మార్చి 2023 నాటికి 122.628 మిలియన్‌ టన్నుల అత్యుత్తమ సరుకు రవాణాను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. జోన్‌ ప్రారంభమైనప్పటి నుండి సరకు రవాణాలో అత్యుత్తమ సరుకు రవాణా ఆదాయం చేరుకొని, తద్వారా ఆదాయం రూ.12,016 కోట్లు ఆర్జించింది.
 
జోన్‌ ప్రారంభమైనప్పటి నుండి సరకు రవాణా ఆదాయంలో అత్యుత్తమ పనితీరు నమోదు చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో 8 మార్చి 2023 నాటికి రూ.12,016 కోట్ల రాబడి ఆర్జించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, సరకు రవాణాలో వినూత్న (టారీఫ్‌, నాన్‌ టారిఫ్‌ పరంగా) చర్యల ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
 
 సరుకు రవాణాను సులభంగా, వేగవంతంగా, మరింత సులభతరం చేయడానికి సరకు రవాణా టెర్మినల్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించింది. దీనితో పాటు సరకు రవాణా సజావుగా సాగేందుకు ముఖ్యమైన గూడ్స్‌ షెడ్‌ల వద్ద మెరుగైన స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ చర్యల చేపట్టడం వల్ల జోన్‌ ప్రారంభమైనప్పటి నుండి అత్యుత్తమ సరుకు రవాణాను సాదించేందుకు దోహదపడిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన సరుకు రవాణా పోల్చితే అన్ని రైల్వే జోనల్‌ లలో దక్షిణ మధ్య రైల్వే రెండవ స్థానాన్ని చేరుకుందని తెలిపింది.