ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలోనే ద్రవ్యోల్బణం

ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలోనే ద్రవ్యోల్బణం

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమలు చేసిన  తగిన సమయంలో అమలు చేసిన సత్వర చర్యలు ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించాయి.  ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలో ద్రవ్యోల్బణం ఉంది అని  2022-23 ఆర్థిక సర్వే పేర్కొంది.  భారతదేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 2022 లో మూడు దశలను దాటిందని సర్వే పేర్కొంది.

2022 ఏప్రిల్ వరకు పెరుగుదల నమోదు చేసిన ద్రవ్యోల్బణం 7.8 శాతానికి, ఆ తర్వాత 2022 ఆగస్టు వరకు 7.0 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం తగ్గి 2022 డిసెంబర్ నాటికి 5.7 శాతానికి పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వేడి, వర్షాభావ పరిస్థితుల వల్ల  పంట దిగుబడులు తగ్గడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించాయి.  

కేంద్ర  ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)  అమలు చేసిన  తగిన సమయంలో అమలు చేసిన సత్వర చర్యలు ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించాయి.  ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలో ద్రవ్యోల్బణం ఉంది. వర్షాలు సక్రమంగా కురవడంతో అవసరమైన స్థాయిలో   ఆహార ధాన్యాల  సరఫరా  సాధ్యమయ్యింది.

కరోనా కాలంలో డబ్ల్యుపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. మహమ్మారి తర్వాత , ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో   టోకు ధరల ద్రవ్యోల్బణం ఊపందుకుంది అని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర సరుకుల స్వేచ్ఛాయుత రవాణాతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులను  రష్యా-ఉక్రెయిన్ వివాదం  మరింత దిగజార్చింది.

ఫలితంగా 2022 ఆర్థిక సంవత్సరంలో టోకు ద్రవ్యోల్బణం రేటు 13.0 శాతానికి పెరిగింది. 2022 మే నెలలో గరిష్టంగా 16.6 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ 2022 సెప్టెంబర్ లో 10.6 శాతానికి, 2022 డిసెంబర్ లో 5.0 శాతానికి పడిపోయింది. డబ్ల్యూపీఐ పెరుగుదలకు కొంతవరకు ఆహార ద్రవ్యోల్బణం, కొంతమేర దిగుమతి ద్రవ్యోల్బణం కారణమని ఆర్థిక సర్వే  పేర్కొంది.

అంతర్జాతీయంగా పెరిగిన వంట నూనెల ధరలు  ప్రభావం దేశీయ ధరలపై కూడా ప్రభావం చూపించింది.  2023 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో భారత మారకపు రేటు కూడా ప్రతికూలంగా ప్రభావితమైంది. దీనివల్ల దిగుమతి చేసుకున్న ముడిసరుకుల ధరలు పెరిగాయి.

సాపేక్షంగా అధిక టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం, తక్కువ వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం మధ్య వ్యత్యాసం 2022 మే లో పెరుగుదల నమోదైంది. ప్రధానంగా రెండు సూచీల సాపేక్ష బరువులలో వ్యత్యాసం, రిటైల్ ధరలపై దిగుమతి చేసుకున్న ముడిపదార్ధాలు ధరలు  ప్రభావం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ద్రవ్యోల్బణం  రెండు కొలతల మధ్య అంతరం తగ్గింది, ఇది ఏకీకరణ ధోరణిని ప్రదర్శిస్తుంది అని సర్వే నివేదిక పేర్కొంది.

డబ్ల్యూపీఐ, సీపీఐ సూచీల మధ్య సమన్వయం ప్రధానంగా రెండు అంశాలతో ముడిపడి ఉందని సర్వే పేర్కొంది. దీనికి మొదటి కారణం ముడి చమురు, ఇనుము, అల్యూమినియం, పత్తి వంటి వస్తువుల ధరలు తగ్గడంతో తక్కువ డబ్ల్యుపిఐకి దారితీసింది. రెండవది, సేవల ధరల పెరుగుదల కారణంగా సిపిఐ ద్రవ్యోల్బణం పెరిగింది.

భారత ద్రవ్యోల్బణ నిర్వహణ భిన్నంగా గుర్తించదగిన అంశంగా ఉంది. ద్రవ్యోల్బణం రేట్లతో సతమతమవుతున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల తో భారత ఆర్థిక వ్యవస్థను  పోల్చవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో మందగమనం ఉంటుందని అంచనా. దీనివల్ల, ప్రపంచ వస్తువుల  ధరల ప్రభావం వల్ల ఏర్పడే  ద్రవ్యోల్బణం ప్రమాదాలు 2023 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో తక్కువగా ఉండే అవకాశం ఉంది.   2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ సవాలు ఈ సంవత్సరం కంటే చాలా తక్కువగా ఉంటుందని ఆర్థిక  సర్వే అంచనా వేసింది.