పెరూలో నిర‌స‌న జ్వాల‌లలో ఆహుతైన ప్ర‌పంచ వార‌స‌త్వ భ‌వ‌నం

పెరూలో దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు జరుపుతున్న నిరసన ఆందోళనల సందర్భంగాపెరూ రాజధాని లిమాలో ఉన్న ప్రపంచ వారసత్వ భవనం ఆందోళనాకారుల ఆగ్రహజ్వాలలకు చిక్కి బూడిదైంది. మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
 
పెరూలో జాతీయ సమ్మె తీవ్ర ఆందోళనకు దారితీసింది. లిమాలోని వరల్డ్‌ హెరిటేజ్‌ బిల్డంగ్‌గా నమోదైన శాన్‌ మార్టిన్‌ ప్లాజా సమీపంలో పెద్ద సంఖ్యలో ఆందోళనాకారులు గుమిగూడారు.  వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు-ఆందోళనాకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న శాన్‌ మార్టిన్‌ భవనంలో మంటలు చెలరేగాయి. క్రమంగా భవనం అంతా విస్తరించి కార్చిచ్చులా మారింది.
 
ఈ భవనం దాదాపు 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఆందోళనాకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు ప్రయోగించిన టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. పెరూలో మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా మద్దతుదారులు – భద్రతా దళాలకు మధ్య కొన్ని నెలలుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.
 
దకాగా, క్షిణ పెరూ నగరమైన అరెక్విపాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనల నేపథ్యంలో తలెత్తిన ఘర్షణల్లో ఒకరు మరణించగా, పదిమంది గాయపడ్డారని ఆంబుడ్స్‌మన్‌ కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది. ”నగరంలో ఉత్తర ప్రాంతంలో వున్న అనషుయాకో వంతెనపై జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించడం పట్ల మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. ఇందుకు బాధ్యులెవరో నిర్ధారించేందుకు వాస్తవాలపై సక్రమ దర్యాప్తు చేపట్టాల్సిందిగా పెరూ ప్రాసిక్యూటర్‌ కార్యాలయాన్ని మేం కోరుతున్నాం.” అని ఆ పోస్టు తెలిపింది.
 
 పెరూలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో, పలు నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని లిమాలో ప్రస్తుత అధ్యక్షురాలు దినా బొలూర్టె రాజీనామా చేయాలని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వేలాదిమంది ప్రజలు నిరసన చేపట్టారు. పలు ప్రాంతాల్లో పోలీసులతో ఘర్షణ పడ్డారు. పెరూ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోనూ పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయడంతో డిసెంబరు 10 నుంచి పెరూ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
 
పౌర సంఘాలు, సంస్థలు ఈ ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో, ప్రజా సమీకరణ సందర్భంగా చోటు చేసుకున్న ట్రాఫిక్‌ ప్రమాదాలు, రోడ్డు దిగ్బంధనాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు మొత్తంగా 50మంది పౌరులు మరణించారని ఆంబుడ్స్‌మన్‌ కార్యాలయం తెలిపింది.