
పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కేషరీనాథ్ త్రిపాఠి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు.
ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ ఉత్తర ప్రదేశ్ లో బిజెపిని బలోపేతం చేసిన నేతలలో త్రిపాఠి ఒకరని కొనియాడారు. ప్రజలకు అందించిన సేవలకు, విషయపరిజ్ఞానంతో ఆయన అందరి గౌరవాన్ని పొందారని, రాజ్యాంగ అంశాలలో ఆయనకు విశేషమైన పరిజ్ఞానం ఉందని ప్రధాని పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన మృతి పట్ల ఆయన కుటుంభం సభ్యులకు, అభిమానులకు ఓ ట్వీట్ లో సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
త్రిపాఠి.. శ్వాస సంబంధిత, చేయి విరగడంతో గత డిసెంబర్ నుంచి స్థానిక ప్రవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. చాలాకాలంపాటు లక్నోలోని సంజయ్ గాధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకున్నారు.
నవంబర్ 10, 1934న అలహాబాద్ లో జన్మించిన ఆయన జులై 2014 నుండి జులై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు. ఆ సమయంలో కొద్దికాలం పాటు బీహార్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల గవర్నర్ గా అదనపు బాధ్యతలు వహించారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఆర్ధిక, వాణిజ్య పన్నుల వంటి శాఖలను నిర్వహిస్తూ జనతా పార్టీ హయాంలో 1977 నుండి 1979 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. కవి, రచయిత. అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. కొద్దికాలం పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు.
More Stories
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ముస్లిం మతగురువు తౌకీర్ రాజా అరెస్టు
‘ఐ లవ్ మహమ్మద్’ వివాదంతో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు