న్యూజిలాండ్ లో 16 ఏళ్లకే ఓటు హక్కు

న్యూజిలాండ్ కొత్త చ‌ట్టాన్ని రూపొందించ‌నున్న‌ది. ఓటు హక్కు వయసును తగ్గిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించబోతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఓటు హక్కును పొందాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. ఈ కనీస వయసును 16 ఏళ్లకు తగ్గించబోతున్నారు. 
 
ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికే ఓటు హక్కును కల్పించడమనేది మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
మరోవైపు ప్రధాని జెసిండ్ కూడా ఓటు హక్కు వయసును తగ్గించడానికి ఆసక్తిగా ఉన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టరూపం దాల్చాలంటే పార్లమెంటులో 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై యువ‌కులు ఓటు వేయాల్సి ఉంటుంద‌ని న్యూజిలాండ్ కోర్టు పేర్కొన్న‌ది.
 
ఇదిలా ఉంచితే, ప్రపంచంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్న దేశాల్లో బ్రెజిల్, క్యూబా, ఆస్ట్రియా దేశాలు మాత్రమే ఉన్నాయి.