చైనాలో 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. ఆరు నెలల తర్వాత కరోనాతో ఒకరు చనిపోయారని చైనా ఆదివారం ప్రకటించింది. కొత్తగా మళ్లీ పెల్లుబుకుతున్న కరోనా  వ్యాధి కారణంగా చైనా అంతటా ఆంక్షలు విధించారు. మే 26 తర్వాత మళ్లీ ఇప్పుడు బీజింగ్‌లో 87 ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడని చైనా పేర్కొంది. 
 
దీంతో కరోనా మరణాల సంఖ్య చైనాలో 5227కు చేరింది. చైనాలో 92 శాతం కంటే ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. బీజింగ్ నగరంలోని వాసులు జిల్లాలకు ప్రయాణించొద్దని ఆంక్ష విధించారు. రెస్టారెంట్లు, షాపులు, మాల్స్, కార్యాలయ భవనాలు, అపార్ట్‌మెంట్లు, వేరుగా ఉన్న వాసాలలోకి పెద్ద సంఖ్యలో జనులు పోవద్దని కూడా నియమాలు విధించారు. 
బీజింగ్‌లోనే 600 మందికిపైగా కరోనా సోకింది. దీంతో అక్కడ అధికారులు పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  చాయోయాంగ్‌, డోంగ్‌చెంగ్‌, జిచెంగ్‌, టోంగ్‌జౌ, యాస్‌కింగ్‌, చాంగ్‌పింగ్‌, షునీ, హైడియన్‌ జిల్లా ప్రజలను కూడా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అక్కడి అధికారులు కోరారు.
అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అందరూ విధిగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 24215 కొత్త కేసులు వెలుగు చూసినట్లు చైనా ఆదివారం వెల్లడించింది. వాటిలో చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయని(ఎసింప్టోమేటిక్) పేర్కొంది.