టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దధించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దధించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి ప్రధాన కార్యదర్శి సిటీ రవి స్పష్టం చేశారు.  బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను శుక్రవారం   మేడ్చల్ రూరల్ జిల్లా అన్నోజిగూడలో ప్రారంభిస్తూ  అందుకు ప్రత్యక్ష నిదర్శనాలే మొన్నటి దుబ్బాక, నిన్నటి హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పే అని గుర్తు చేశారు.
 
 కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దాదాపు రూ 600 కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్ బిజెపిని ఓడించలేక పోయారని తెలిపారు.  ఉప ఎన్నికలు మాత్రమే కాదు జనరల్ ఎలక్షన్ సైతం ఎప్పుడు జరిపినా బిజెపి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ను చంచల్ గూడా జైలుకు పంపుతామని చెప్పారు.
 
 సీఎం నుంచి పీఎం వరకు దేశంలో 20 ఏళ్లుగా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని నాయకత్వం నరేంద్ర మోదీ సొత్తని ఆయన చెప్పారు. బిజెపి ఎన్డీయే ప్రభుత్వాన్ని నడిపిస్తే గతంలో పాలించిన కాంగ్రెస్ నుంచి నేటి టిఆర్ఎస్  పార్టీల వరకు డీఎంఏ సర్కార్ నడిపించాలని ఉద్దేశంతో కుటుంబం ఆధారంగా ప్రభుత్వాలను స్థాపిస్తున్నాయని రవి ధ్వజమెత్తారు.
 
ప్రజాస్వామ్య విలువలకు సామాజిక న్యాయం అనే పదానికి కచ్చితమైన నిదర్శనం అని బిజెపి జాతీయ ఎస్సి మోర్చా ఇన్చార్జి అయిన రవి తెలిపారు.  బిజెపి అవకాశం వచ్చినప్పుడల్లా ఈ దేశ అత్యున్నత స్థానంలో రాష్ట్రపతిగా ఒకసారి ఏపీజే అబ్దుల్ కలాంను, మరోసారి కోవింద్ ను, ఇప్పుడు ద్రౌపది ముర్మును చేసిందని ఆయన గుర్తు చేశారు.
 
 సామాన్య కార్యకర్తలను నాయకులుగా నిలబెట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీదని చెప్పారు.  కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ లాంటి పార్టీలో ఫ్యామిలీ వికాస్ నినాదంతో ముందుకు పోతున్నాయని ధ్వజమెత్తారు.
అంబేద్కర్ జీవితాన్ని ప్రతిబింబించేలా ఐదు ప్రాంతాలను పంచశీల క్షేత్రాలుగా అభివృద్ధి చేసి అంబేద్కర్ గారిని బిజెపి గౌరవించిందని పేర్కొన్నారు.
 
మోదీ ప్రభుత్వం 300 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు.  రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉండాలని కోరుతూ  ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని పార్టీ గౌరవిస్తుందని టికెట్లు ఇస్తుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు.
 
 మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా అధ్యక్షత వహించారు. తెలంగాణ యస్సిమోర్చా ఇంచార్జి మునిస్వామి, జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, మాజీ ఎమ్యెల్యే అరుణతార పాల్గొన్నారు