జమ్మూకశ్మీర్ లో 20 రోజుల్లో 23 మంది ఉగ్రవాదుల హతం 

జమ్మూకశ్మీర్ లో భారీగా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈనెల 30 నుంచి అమర్ నాథ్ యాత్ర మొదలవుతుండడంతో భద్రతా పరిస్థితులను కట్టుదిట్టం చేశారు. గత 20 రోజులలో 23  మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతం చేశాయి. 
 యాత్రికులపై ఎలాంటి దాడులు జరగకుండా ముందస్తుగా సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్స్ లో భాగంగా కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి టెర్రరిస్టులను హతమార్చారు.
అటు పుల్వామా ఎన్ కౌంటర్ లో ఒక టెర్రరిస్ట్ హతమయ్యాడు. వీరు పాకిస్తాన్ కు చెందిన వారిగా గుర్తించారు. జమ్మూకశ్మీర్ లో సామాన్యులపై దాడులు మొదలైన తర్వాత భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి.  గత 18 గంటల్లో 3 ఎన్ కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులను కాల్చివేశారు.
కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత అమర్ నాథ్ యాత్రకు భక్తులను అనుమతించడంతో ముందస్తుగా అలర్ట్ అవుతున్నారు.