ప్రధాని మోదీ ఐకానిక్‌ వారోత్సవం ప్రారంభం రేపే!

ప్రధాని మోదీ ఐకానిక్‌ వారోత్సవం ప్రారంభం రేపే!

ప్రధాని నరేంద్ర మోదీ  ఆర్థిక మంత్రిత్వశాఖ ఐకానిక్‌ వీక్‌ను సోమవారం డిజిటల్‌ మీడియా ద్వారా ప్రారంభించనున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నారు.  అజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని హోటల్‌ మురళీ ఫార్చూన్‌ వేదికగా ఆదాయ పన్నుశాఖ నిర్వహించనుంది.

ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ ఉప కమిషనర్‌ ఏటీకే మూర్తి ఒక ప్రకటన చేస్తూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సీబీడీటీ, సీజీఎస్‌టీ, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఐసీఎఐ, బ్యాంకు అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా ఆర్థికశాఖ వార్శిక పురోగతిని వివరించే డిజిటల్‌ ప్రదర్శన, అజాదీ అమృత్‌ మహోత్సవ్‌ లోగోలోని వేర్వేరు డినామినేషన్‌తో కూడిన ఐదు కాయిన్స్‌ను ప్రధాని విడుదల చేయనున్నారు. జన సమర్థ్‌ ఏకీకృత పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు.  ఈ-పోర్టల్‌ క్రెడిట్‌ లింక్‌ (ఆధారిత), ప్రభుత్వ పథకాలను ఒకే క్లిక్‌తో తెలుసుకునే సౌలభ్యం దీని ద్వారా లబ్దిదారులకు కలుగుతుందని మూర్తి తెలిపారు.