గూగుల్ అనువాదంలో సంస్కృతం

ఎట్టకేలకు గూగుల్ అనువాదంలో సంస్కృతంను ప్రవేశపెడుతున్నారు.  సంస్కృతంతో సహా కొత్తగా ఎనిమిది భారతీయ భాషలను అనువాదంకు జత టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఈ ప్రకటన చేసింది. వీటితోపాటు  ఇతర దేశాలకు చెందిన మరో 16 భాషలను కూడా అనువాదంకు జత చేసింది.
 
 దీంతో కొత్తగా 24 భాషలు జత కావడంతో గూగుల్ అనువాదంకు మొత్తం మీద ఇక నుండి 133 భాషలకు సదుపాయం లభించనుంది. కొత్తగా యాడ్ చేసిన భాషలను ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మిజో భాషను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో 8లక్షల మంది మాట్లాడుతున్నారు. 
 
గూగుల్ అనువాదంలో కొత్తగా జత చేసిన భాషలు:  సంస్కృతం, అస్సామీ, మిజో, డోగ్రీ, కొంకణి, మణిపురిమైథిలీ, భోజ్‌పురి.
అనువాదంలో సంస్కృత భాషను జతచేయాలని తమకు అత్యధిక అభ్యర్థనలు వచ్చాయని గూగుల్‌కు చెందిన ఓ సీనియర్ ఇంజినీర్ వెల్లడించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భాషలను తొలిసారిగా జత చేస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే ఈ భాషలు జత అవుతాయి. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌లోని భారతీయ భాషల సంఖ్య 19కి చేరింది.

మధ్య ఆఫ్రికాలో 4.5కోట్ల మంది మాట్లాడే లింగల భాషను కూడా అనువాదంకు గూగుల్ జత చేసింది. అలాగే గౌరాని, ఇలాకానో సహా మొత్తంగా కొత్తగా ఇతర దేశాలకు చెందిన 16 భాషలను ప్రవేశపెట్టింది.