
యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకారం తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కూడా ఉర్సులా భేటీ అయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సంబంధాలను, సహకారాన్ని విస్తరించుకునేందుకు ఇయు, భారత్ అంగీకరించాయి. ఇందుకోసం వాణిజ్య, సాంకేతిక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇయు చీఫ్ వాండెర్ లేయర్ పలు పర్యటనలు చేస్తున్నారు.
అందులో భాగంగా భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అధికారులతో ఆమె భేటీ అయ్యారు. సోమవారం భారత్‌తో ఇయుకి కుదిరిన తరహాలోనే అమెరికా కూడా ఇయుతో సాంకేతిక ఒప్పందాన్ని కలిగివుంది. గతంలో కన్నా మరింత కీలకమైన సంబంధాలు ఈనాడు నెలకొన్నాయని భావిస్తున్నట్లు ఇయు చీఫ్ వ్యాఖ్యానించారు.
భద్రత, వాతావరణ మార్పు, వాణిజ్య రంగాల్లో సహకారం వుండాలని ఇరు పక్షాలు గుర్తించాయి. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ వాతావరణంలో కూలంకషమైన రీతిలో సంయుక్త వ్యూహాత్మక భాగస్వామ్యం వుండాల్సిన అవసరం వుందని భావించినట్లు ఇయు-భారత్ సంయుక్త ప్రకటన పేర్కొంది.
వాణిజ్య, సాంకేతిక మండలి ఇందుకు అవసరమైన రాజకీయ సారధ్యాన్ని అందిస్తుంది. రాజకీయ నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన కూర్పును కూడా అందిస్తుంది. సాంకేతిక కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. ఇరుపక్షాల ఆర్థిక వ్యవస్థలు సుస్థిర పురోగతి సాధించేందుకు కీలకమైన రంగాల్లో అవసరమైన చర్యల అమలుకు హామీ కల్పిస్తుంది.
వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు, వాతావరణం వంటి రంగాల్లో విస్తృత సహకారాన్ని పొందేందుకు ఇరు పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించామన్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం