
కాంగ్రెస్ పార్టీ అధినేతగా గాంధీయేతరులనే ఎన్నుకోవాలని స్పష్టం చేస్తూ ఎందుకంటే రాహుల్ గాంధీకి స్థిరత్వం లేదని ఆ పార్టీ సీనియర్ నేత పీజే కురియన్ విమర్శించారు. రాహుల్ గాంధీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఏర్పర్చుకోలేక పోతున్నదని ఆయన పేర్కొన్నారు.
తాజాగా `కేరళ శబ్దం’ అనే మలయాళ వీక్లికీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుస ఓటములతో చతికిలబడిన కాంగ్రెస్‌కు స్థిరమైన, నమ్మకమైన నాయకత్వం కావాలని మాజీ కేంద్ర మంత్రి సూచించారు. “ఓడ ప్రమాదంలో ఉన్నప్పుడు కెప్టెన్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్లిపోకూడదు. కానీ 2019లో జరిగింది ఏంటి? కాంగ్రెస్ ఓడిపోగానే అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. కానీ పార్టీకి సంబంధించి ఇప్పటికి కీలక నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారు” అని గుర్తు చేశారు.
2019 ఎన్నికలలో ఓటమి తర్వాత సమిష్టిగా చర్చించి, ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పోయి రాహుల్ పారిపోయారని చెబుతూ మరొకరిని అధ్యక్షునిగా ఉండనివ్వరు, తాను అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖంగా ఉండరు అంటూ విస్మయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షునిగా ఉండాలనుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే అది పార్టీ సంస్థాగత పరంగా జరగాలని స్పష్టం చేశారు.
రాహుల్ చుట్టూ ఒక కోటరి చుట్టుముట్టిందని పేర్కొంటూ ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి సంస్థాగతమైన జ్ణానం, ఎన్నికల చరిత్రపై అవగాహన లేదని ధ్వజమెత్తారు. రాహుల్ సైతం తనకు సన్నిహితంగా ఉండే నాయకులను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని చెబుతూ ఇలాగైతే పార్టీ ముందుకు సాగదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు.
పార్టీని కాపాడే సూచనలు చేసే సీనియర్ నాయకులను పక్కన పెట్టేస్తున్నారని కురియన్ దుయ్యబట్టారు ప్రస్తుత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులను సూచిస్తూ అధినేత సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ (జీ-23) నాయకుల్లో కురియన్ కూడా ఒకరు.
ఈ లేఖపై సైతం ఆయన ప్రస్తావిస్తు గడిచిన రెండేళ్లలో పది అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా సొంతంగా గెలవలేకపోయిందని గుర్తు చేశారు. ‘‘కొంతకాలంగా పార్టీకి తలలేకుండా పోయింది. పార్టీ అత్యంత కీలకమైన పరిస్థితులో ఉన్నప్పుడు రాహుల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు స్థిరత్వం ఉంటే అలా చేసేవారు కాదు” అంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ ఆయనకు తిరిగి పగ్గాలు ఇవ్వదని కురియన్ తేల్చి చెప్పారు.
పార్టీకి ఇప్పుడు బలమైన నాయకత్వం కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉండాల్సిన అవసరం ఉందని చెబుతూ, ఆ విధంగా లేకపోవడమే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. వరుసగా పార్టీ పరాజయాలకు గురికావడానికి సహితం అదే కారణమని స్పష్టం చేశారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!