
హనుమాన్ జయంతి రోజున శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగిన రెండు రోజుల తర్వాత, సోమవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి నుండి రాళ్ల దాడికి సంబంధించిన తాజా సంఘటన నమోదైందని పోలీసులు తెలిపారు.
శనివారం ఘర్షణ జరిగిన ప్రదేశానికి సమీపంలో పైకప్పు నుండి రాజాగా రాళ్ళు, ఇటుకలు విసిరివేశారు. సంఘటన తర్వాత పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారులు ఆ ప్రాంతంలో రు. ఒకరినిఘర్షణలు విస్తరింపకుండా కట్టడి చేశారు. ఈ సందర్భంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ (వాయువ్య) ఉషా రంగరాణి తెలిపారు.
“ఏప్రిల్ 16న జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లలో ఒక వ్యక్తి (నీలం రంగు కుర్తాలో) కాల్పులు జరుపుతున్నట్లు చూపించే వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. వాయువ్య జిల్లా నుండి ఒక పోలీసు బృందం సిడి పార్క్ రోడ్‌లోని అతని కోసం, అతని కుటుంభం సభ్యులను పరిశీలించడానికి అతని ఇంటికి వెళ్ళింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వారిపై రెండు రాళ్లు రువ్వారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, ”అని ఆమె వివరించారు.
ఆ కుటుంబం నివాసం ఉండే ఇరుకైన సందులోకి రాళ్లు విసిరారు. దీనిని అనుసరించి, అల్లర్ల గేర్‌లో ఉన్న భద్రతా సిబ్బంది లేన్‌లోకి ప్రవేశాన్ని మూసివేశారు. నెమ్మదిగా మీడియా సిబ్బందిని కుశాల్ చౌక్‌కు బయటకు నెట్టివేసి, ప్రధాన రహదారిని బారికేడ్లతో మూసివేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్నందుకు ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశారు.
More Stories
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు