కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు

కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. మూడో వేవ్ తర్వాత భారీగా తగ్గిన కేసులు, మరణాలతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 2,183 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఆదివారం నమోదైన కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఇది రెట్టింపుగా చెప్పొచ్చు. ఆదివారం 1,150 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో కేసులు రెండింతలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలోనే ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది.

కరోనా మూడో వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నాలుగో వేవ్ ప్రమాదం పొంచి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వేయికి అటుఇటుగా నమోదైన కేసులు మళ్లీ ఒక్కసారిగా రెండు వేల మార్క్ దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా  కేసు పాటిజివిటీ రేటు ఒక్కసారిగా పెరుగుతుంటడంతో కేంద్రం అప్రమత్తమైంది. 

జనవరి తర్వాత పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుంది. ఢిల్లీ, యుపి, హర్యానా రాష్ట్రాల్లో కేసులు రెండింతలు పెరిగాయి. యుపిలో 141%, హర్యానాలో 118% మేర కేసులు పెరిగాయి. దీంతోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా 11 వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు కాస్త.. ఆదివారం ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఫోర్త్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 214 మంది మృతి చెందారు.  మరణించిన  కేసులు ఎక్కువగా కేరళలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్కరోజులో 62 మంది కరోనాతో చనిపోయారు. ఆదివారం అక్కడ కొవిడ్ తో నలుగురు మాత్రమే మృతి చెందగా, 24 గంటల్లో వేగంగా పెరిగింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 

గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 1,985 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా ఉంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 186.54 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.