
దీర్ఘకాల కరోనాతో బాధపడుత్నువారు ఎంతమందో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 20 శాతం మంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా దీర్ఘకాలం కరోనా ప్రభావం ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెల్లడించింది.
ముఖ్యంగా 25- 50 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఈ దీర్ఘకాల కరోనా బారిన పడుతున్నారని గుజరాత్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేశ్ పండిత్ తెలిపారు. గరిష్ఠంగా ఆరు నెలల పాటు ఈ సమస్య వేధించొచ్చని చెబుతున్నారు.
కరోనా సమయంలో వెంటిలేటర్ సాయం తీసుకున్నవారిలో ఇప్పుడు ఊపిరితిత్తులు తీద్రంగా దెబ్బతిన్నాయి. నాడీ వ్యవస్థ , కిడ్నీలు, జీర్ణాశయ పేగులపైనా ఈ దీర్ఘకాల కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీర్ఘకాల కరోనా బారిన పడిన వారిలో అత్యంత తీవ్రమైన లక్షణం శ్వాసకోశ సమస్య అని వైద్యులు చెబుతున్నారు.
దీంతోపాటు కండరాలు బలహీనంగా ఉండటం, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, జుట్టు ఊడటం, కంటి చూపు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నట్టు తెలిపారు. కొంతమంది 15 20 కిలోల వరకు బరువు తగ్గినట్టు రాకేశ్ పండిత్ తెలిపారు. గుండె చప్పుడు పెరగడం, ఒత్తిడి, ఆందోళన , నిల్చున్నప్పుడు కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఉంటున్నట్టు చెప్పారు.
ఇప్పటివరకు దీర్ఘకాల కరోనాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే పెయిన్ కిల్లర్లు, మల్టీ విటమిన్లతో పాటు , ఫిజికల్ థెరపీ, యోగా, వంటి వాటితో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాల కరోనా సమస్య ఎదుర్కొంటున్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా