మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్‌‌ అరుదైన ఘనత

మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్‌‌ అరుదైన ఘనత

మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు కెప్టెన్  మిథాలీరాజ్ శనివారం భారీ రికార్డును నమోదు చేశారు. మిథాలీరాజ్ ఇప్పుడు మహిళల ప్రపంచ కప్‌లలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ శనివారం ఆడుతున్నారు.

హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగిన టోర్నమెంట్‌లోని తమ మూడవ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ జట్టు ఆడుతోంది. మిథాలీ రాజ్ ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడి రికార్డును నెలకొల్పారు. 23 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్‌ సాధించిన రికార్డును మిథాలీరాజ్ దాటేసారు.

ఈ మధ్యనే మహిళా ఒక రోజు క్రికెట్ పోటీలలో 6,000 పరుగులు అధిగమించిన తొలి క్రీడాకారిణిగా ఖ్యాతి గడించారు. ఒక రోజు క్రికెట్ లో వరుసగా ఏడు ఆటలలో 50కు పైగా పరుగులు తీసిన క్రీడాకారిణి కూడా ఆమెనే. 2019లో న్యూజీలాండ్ పై ఆడి టి20లో 200కు పైగా ఆటలు ఆడిన మొదటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.  అంతర్జాతీయ క్రికెట్ లో 20 ఏళ్ళు పూర్తి చేసిన తొలి మహిళా ఆమె. ఒడి1 లపై దృష్టి సారించడం కోసం 2019లో ఆమె టి20 నుండి నిష్క్రమిస్తున్నల్టు ప్రకటించారు.

1982 డిసెంబర్ 2న రాజస్థాన్ లోని జోధాపూర్ లో ఒక తమిళ్ కుటుంభంలో జన్మించిన ఆమె తండ్రి దొరైరాజ్ వైమానికదళంలో అధికారి. ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆమె 10 ఏళ్ళ వయస్సు నుండే ఆటలు ఆడటం ప్రారంభించారు. 14 ఏళ్ళ వయస్సులోనే ఆమె భారత దేశం తరపున ఒడి1, టెస్ట్ మ్యాచ్ లలో క్రికెట్ ఆడారు.

ఇప్పటి వరకు మిథాలీ 23 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఆడారు. ఇప్పటి వరకు జరుగుతున్న టోర్నీలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడి రెండు మ్యాచ్‌ లలో గెలిచింది.  భారత జట్టు టోర్నమెంట్ ఓపెనర్‌లో పాకిస్తాన్‌ను ఓడించగా,   వారి తర్వాతి గేమ్‌లో న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడో మ్యాచ్ లో వెస్టిండీస్‌పై విజయం సాధించి రికార్డును కైవసం చేసుకొంది.

2003లో అర్జున్ అవార్డు, 2015లో పద్మశ్రీ వంటి పలు పురస్కారాలు అందుకున్నారు. భారత మహిళా క్రికెట్ లో “లేడీ సచిన్ టెండూల్కర్”గా పేరొందిన ఆమె అన్ని క్రికెట్ ఫార్మటులలో ఆమెనే అగ్రగామిగా ఉంటూ వస్తున్నారు. 2005 నుండి భారత్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. 

 వెస్టిండీ్‌సను చిత్తు చేసిన భారత్ జట్టు 

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్లు స్మృతీ మంధాన (119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హర్మన్‌ప్రీత్‌ (107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) శతకాలతో కదం తొక్కడంతో.. మహిళల వరల్డ్‌కప్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 155 పరుగుల తేడాతో వెస్టిండీ్‌సను చిత్తు చేసింది. మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్‌నకు దూసుకెళ్లింది.