నేరస్థులకు టిక్కెట్లు ఇస్తున్న అఖిలేష్

సమాజవాది పార్టీ అధినేత నేరస్థులకు టిక్కెట్లు ఇస్తున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. తాను తిరిగి ఎన్నికైతే ఈ నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. ‘నేరస్థులకు ఎన్నికల టిక్కెట్లు ఇవ్వడం ద్వారా సమాజ్‌వాదీ పార్టీ తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ నేరగాళ్లను శిక్షిస్తాం’ అని యూపీలోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ  బహిరంగంగా ప్రకటించ లేదని, డబ్బులు తీసుకుని టిక్కెట్లు కేటాయిస్తోందని ఉత్తరప్రదేశ్  ఆదిత్యనాథ్ ఆరోపించారు.  అలవాట్లు అంత త్వరగా మారవని, అందుకోసమే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ముఖం చేటేస్తున్నారని, బహిరంగంగా పేర్లు బయటపెట్టకుండా పార్టీ గుర్తును గుట్టుచప్పుడు కాకుండా కేటాయిస్తూ, అందుకోసం సొమ్ములు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

అన్నారు. టిక్కెట్లను నేరస్థులకు కేటాయించడం ద్వారా తమ నిజ స్వరూపాన్ని సమాజ్‌వాదీ పార్టీ మరోసారి చాటుకుంటోందని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ నేరగాళ్లందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. గత ఐదేళ్లుగా ఇక్కడ నేరగాళ్లు, హిస్టరీ షీటర్లు భయంతో వణుకుతున్నారని పేర్కొన్నారు.

నేరస్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా సమాజ్ వాదీ పార్టీ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని ఆయన మండిపడ్డారు. కైరానా సిట్టింగ్ ఎమ్మెల్యే నహీద్ హసన్ కు ఎస్పీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నహీద్ పై  2021లో గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదు అయ్యిందని గుర్తు చేసారు. 
హసన్ నామినేషన్ వేసేందుకు  పత్రాలు తీసుకుని వస్తుండగా పోలీసులు అతడిని మార్గ మధ్యలో అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. దానితో అతని అభ్యర్థిత్వాన్ని పార్టీ మార్హ్చింది. నేర చరిత్ర ఉన్న నహీద్ ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని యోగి  డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అతని అరెస్టును ఖండిస్తూ అధికార పార్టీ తమ నాయకులను, అభ్యర్థులను దెబ్బతీసేందుకు ప్లాన్ చేసిందని ఆరోపించారు.
కాగా,  నిన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కాన్పూర్ మాజీ పోలీస్ అధికారి  అసిమ్ అరుణ్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు హసన్ అరెస్ట్ , సీతాపూర్ జైలు నుండి బెయిల్ పై  సమాజ్వాది సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం విడుదల గురించి ప్రస్తావించారు.
అల్లర్లు చేసేవారు సమాజ్‌వాదీ పార్టీలో చేరతారని, అల్లర్లను బయటపెట్టినవారు బీజేపీలో చేరతారని ఆయన ఎద్దేవా చేశారు
ఇలా ఉండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ పేరును ఇప్పటికే ప్రకటించిన బీజేపీ తాజాగా విపక్ష నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
అఖిలేష్ యాదవ్ (ఎస్‌పీ), మాయావతి (బీఎస్‌పీ), ప్రియాంక గాంధీ వాద్రా (కాంగ్రెస్) పోటీకి దిగుతున్నారో లేదో ప్రజలకు చెప్పాలని సవాలు విసిరింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అని ఓ ట్వీట్‌లో బీజేపీ రాష్ట్ర విభాగం ప్రశ్నించింది. 
 
18 ఏళ్ల తర్వాత యూపీ సిట్టింగ్ ఎంపీ (యోగి ఆదిత్యనాథ్) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ విషయం మరిచిపోయిన నేతలు కనీసం నొయిడాలో కూడా పర్యటించలేదంటూ ఛలోక్తులు విసిరింది.